ఇంటి వెనుకాలే సారాయి బ‌ట్టి

క్రైం తాండూరు

ఇంటి వెనుకాలే సారాయి బ‌ట్టి
– దాడులు నిర్వ‌హించి ద్వంసం చేసిన పోలీసులు
– 5లీట‌ర్ల సారాయి స్వాదీనం, ఇద్ద‌రిపై కేసు
తాండూరు రూర‌ల్, ద‌ర్శిని ప్ర‌తినిధి: గ్రామాల్లో సారాయి త‌యారిపై దాడులు నిర్వ‌హించి అరిక‌ట్టేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం చ‌ర్య‌లు చేప‌డుతోంది. ఇందులో బాగంగా తాండూరు మండ‌లంలో ఎక్సైజ్, సివిల్ పోలీసులు విశ్వ‌స‌నీయ స‌మాచారం మేర‌కు గురువారం త‌నిఖీలు చేప‌ట్టారు. క‌ర‌ణ్ కోట్ ఎస్ఐ ఏడుకొండ‌లు, ఎక్సైజ్ పోలీసులు మండ‌లంలోని వీర్‌శెట్టిప‌ల్లి, రాంపూర్, రాంపూర్ క్రింది తాండాలో త‌నిఖీలు నిర్వ‌హించారు. రాంపూర్ కింది తాండాలో నిర్వ‌హించిన త‌నిఖీలో మూడావ‌త్ చంద్ర‌నాయ‌క్ అనే వ్య‌క్తి అత‌ని భార్య హ‌నిబాయితో క‌లిసి ఇంటి వెనుకాల సారా బ‌ట్టీ నిర్వ‌హిస్తున్న‌ట్లు గుర్తించారు. వెంట‌నే సారా బ‌ట్టీని ద్వంసం చేసి నిందితులిద్ద‌రిని అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా వారి వ‌ద్ద నుంచి 5లీట‌ర్ల సారాయిని స్వాదీనం చేసుకున్నారు. నిందితులైన భార్య‌, భ‌ర్త‌లిద్ద‌రిపై ఎక్సైజ్ చ‌ట్టం కింద కేసు న‌మోదు చేయ‌డం జ‌రిగింద‌ని పోలీసులు వెల్ల‌డించారు.