కాంగ్రెస్ ను ‘గ్యారెంటీ’గా నమ్మరు..!
– తప్పుడు ప్రచారం చేస్తే ఖాబాడ్దార్
– బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు ఖాయం
– గనుల శాఖ మంత్రి మహేందర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ‘గ్యారెంటీ’గా నమ్మే పరిస్థితి లేదని, ఉనికి కోసమే ఆ పార్టీ ప్రయత్నిస్తోందని రాష్ట్ర సమాచార, గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు. బుధవారం తాండూరు పట్టణంలోని నివాసంలో మీడియాతో మాట్లాడారు. దేశంలో ఎక్కడ లేని విధంగా సీఎం కేసీఆర్ పేదల కోసం మేనిఫెస్టో ప్రవేశ పెట్టారని అన్నారు. ఇందుకు ఆదరణ లభించడంతో ఓర్వలేక కాంగ్రెస్ దుస్ప్రచారం చేస్తుందని ఆరోపించారు. కర్ణాటకలో కాంగ్రెస్ గ్యారేంటి పథకాలు అమలు సాధ్యం కావడం లేదన్నారు. తెలంగాణలో గ్యారేంటిని నమ్మే పరిస్థితి లేదన్నారు.

జిల్లాలోని వికారాబాద్, పరిగి, కొడంగల్, తాండూరు నియోజకవర్గాలలో బీఆర్ఎస్ గెలుపు ఖాయం అన్నారు. తాండూరులో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గెలుపు కోసం వర్గ బేధాలు లేకుండా అందరూ కృషి చేస్తున్నారని అన్నారు. పార్టీ అభ్యర్థుల గెలుపు భాద్యత తనదే అన్నారు. పార్టీపై, నేతలపై తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదని, ఖాబడ్దార్ అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కరణం పురుషోత్తం రావు, డీసీసీబీ జిల్లా డైరెక్టర్ రవీందర్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ పట్లోళ్ల నర్సింలు, యాలాల పీఏసీఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, నాయకులు తాటికొండ పరిమల్, భరత్ భూషణ్ తదితరులు ఉన్నారు.

