సీఎం సహాయ నిధి పేదలకు అండ
– కోట్‌పల్లి మార్కెట్ కమిటి చైర్మన్ ఉప్పరి మహేందర్
కోట్‌పల్లి, దర్శిని ప్రతినిధి: అనారోగ్యంతో బాధపడుతునన నిరుపేదలకు తెలంగాణ ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ అందిస్తున్న ఆర్థిక సాయం వారికి అండగా నిలుస్తుందని కోట్‌పల్లి మార్కెట్ కమిటి చైర్మన్ ఉప్పరి మహేందర్ అన్నారు. సోమవారం తాండూరు శాసనసభ్యులు పైలట్ రోహిత్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం కోటపల్లి మండల కేంద్రానికి జి. రత్నమ్మకు మంజూరు అయిన రూ. 1లక్ష ఎల్ఓసీ చెక్కును అందించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనారోగ్యానికి గురైన ఎంతో మంది పేదలు వైద్యం చేయించుకోలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని అన్నారు. అలాంటి నిరు పేద ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయం అందించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అర్హులైన నిరుపేదలు సీఎంఆర్ఎఫ్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాములు, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి కుమ్మరి లాలప్ప, సీనియర్ నాయకులు లక్కాకుల మల్లేశం, మత్స్య సహకార సంఘం అధ్యక్షులు రావిరాల ఆనంద్, మండల పార్టీ కార్యదర్శి ఓగులాపురం రాజు , అన్న సాగర్ క్రిష్ణ, లింగంపల్లి గ్రామ కమిటీ అధ్యక్షులు అనంత్ రెడ్డి,కోటపల్లి పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు శ్రీనివాస్ గుప్తా, గ్రామ కమిటీ ప్రధాన కార్యదర్శి సుశీల్ కుమార్, గ్రామ రైతు సంఘం అధ్యక్షులు రత్నయ్య, గ్రామ ఉపాధ్యక్షులు మోసిన్, గ్రామ మైనారిటీ అధ్యక్షులు ఇస్మాయిల్, యువజన విభాగం మంగళి నగేష్, గడ్డం అనిల్, నరేష్, ఎల్లప్ప తదితరులు పాల్గొన్నారు.
