విద్యుద్ఘాతంతో గేదె, ఆవు మృత్యువాత

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

విద్యుద్ఘాతంతో గేదె, ఆవు మృత్యువాత
– తాండూరు మండలం అంతారంలో ఘటన
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : విద్యుత్ షాక్ తగిలి ఓ గేదె, ఓ ఆవు మృత్యువాత పడ్డాయి. ఈ సంఘటన సోమవారం తాండూరు మండలం అంతారం గ్రామంలో జరిగింది.

బాధితులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన పెండా స్వామి ద్వాస్ గేదె, ఆవులను పోషిస్తున్నారు. అయితే రోజూ మాదిరిగానే గేదె, ఆవులను మేత కోసం తీసుకవెళ్లారు. గ్రామ సమీపంలో ఉన్న ఓ పొలంలో మేత మేస్తుండగా పొలం రక్షణ కోసం ఉంచిన విద్యుత్ తీగ ప్రమాద వశాత్తు తగిలింది.

విద్యుత్ షాక్ కు గురైన గేదె, ఆవులు అక్కడికక్కడే మృతి చెందాయి. ఈ ప్రమాదంతో తమకు తీవ్ర నష్టం జరిగిందని బాధితుడు పెండా స్వామి దాస్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పరిహారం అందించాలని కోరారు.

ఇదికూడా చదవండి…

పంచాయతీలో పట్టభద్రుడి విజయం..!