మంత్రి కేటీఆర్‌ను క‌లిసిన మాజీ ఎమ్మెల్యే నారాయ‌ణరావు

తాండూరు రాజకీయం వికారాబాద్

మంత్రి కేటీఆర్‌ను క‌లిసిన మాజీ ఎమ్మెల్యే నారాయ‌ణరావు
– పార్టీకి స‌హాక‌రించాల‌ని సూచించిన కేటీఆర్
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ను తాండూరు మాజీ ఎమ్మెల్యే ఎం. నారాయ‌ణరావు భేటీ అయ్యారు. శుక్ర‌వారం తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో హైద‌రాబాద్‌లోని ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో మాజీ ఎమ్మెల్యే నారాయ‌ణరావు కేటీఆర్‌ను మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సంద‌ర్భంగా కేటీఆర్ నారాయ‌ణ‌రావును అప్యాయంగా ప‌ల‌క‌రించారు. అనంత‌రం మంత్రి కేటీఆర్ నారాయ‌ణ‌రావుతో పార్టీ వ్య‌వ‌హారాల‌పై చ‌ర్చించారు. ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లాలో సీనీయ‌ర్ నాయ‌కులుగా ఉన్న నారాయ‌ణ‌రావును టీఆర్ఎస్ పార్టీ బ‌లోపేతానికి తోడ్పాటు అందించాల‌ని సూచించారు. ఇందుకు మాజీ ఎమ్మెల్యే నారాయ‌ణ‌రావు పార్టీ ప‌టిష్టానికి పూర్తి స‌హాకారం అందిస్తామ‌ని తెలిపారు. దీనిపై మంత్రి కేటీఆర్ హ‌ర్షం వ్య‌క్తం చేస్తూ మాజీ ఎమ్మెల్యే నారాయ‌ణ‌రావు సేవ‌ల‌ను వినియోగించుకోవాల‌ని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డితో పేర్కొన్నారు.