కాలేజీలో ఇద్దరు దొంగలు..!
– అర్దరాత్రి చోరీకి యత్నాలు రికార్డు
– ప్రిన్సిపల్ రూంలో బీరువాలు ధ్వంసం
తాండూరు, దర్శిని ప్రతినిధి : కాలేజీలో ఇద్దరు దొంగలు చోరికి యత్నించారు. ఈ సంఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. యాలాల ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

తాండూరు పట్టణం హైదరాబాద్ రోడ్డు మార్గంలో మైనార్టీ స్కూల్, కాలేజీ కొనసాగుతోంది. అయితే గురువారం అర్దరాత్రి దాటిన తరువాత ఒంటి గంట సమయంలో ఇద్దరు వ్యక్తులు మాస్కులతో కాలేజీలోకి చొరబడ్డారు. కాలేజీలోని ప్రిన్సిపల్ రూంలోకి వెళ్లి బీరువాలను పగులగొట్టారు.

వస్తువులను చిందర వందర చేశారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలలో రికార్డు అయ్యాయి. విషయం తెలుసుకున్న ప్రిన్సిపల్ యాలాల పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఎస్ఐ విఠల్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. సీసీ పుటేజీ దృశ్యాలను పరిశీలించారు. ఈ దృశ్యాలలో నిందితుల వివరాలు తెలిస్తే పోలీసులను సంప్రదించాలని సూచించారు. మరోవైపు ఈ ఇద్దరు దొంగలు కాలేజీలో చేసిన చోరిలో వారికి ఎలాంటి వస్తువులు దొరకకపోవడంతో ఏమి ఎత్తుకెళ్లలేనట్లుగా గుర్తించారు.

ఇదికూడా చదవండి…

