కోట్ పల్లి సర్పంచ్ భర్త కుటుంభానికి భరోసా..!

తాండూరు రాజకీయం వికారాబాద్

కోట్ పల్లి సర్పంచ్ భర్త కుటుంభానికి భరోసా..!
– పరామర్శించిన తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లా కోట్‌పల్లి నూతన సర్పంచ్ భర్త సంగయ్య స్వామిని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పరామర్శించారు.

ఇటీవల గ్రామస్తుల దాడిలో సర్పంచ్ భర్త సంగయ్య స్వామి గాయాలపాలై హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. శనివారం బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్‌తో కలిసి మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ఆసుప్రతి సిబ్బందితో మాట్లాడి సంగయ్య స్వామి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులను పరామర్శించి.. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ ఘటనకు బాధ్యులైన వారిని వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ నీ కోరారు. అలాగే సంగయ్య స్వామి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

ఇదికూడా చదవండి…

పెరుమాళ్ల వెంకట్ రెడ్డికి అభినందనలు