రేపు బీసీ సర్పంచులకు సన్మానం
– బీసీ సంఘం ఆధ్వర్యంలో పార్టీకతీతంగా నిర్వహణ
– జయప్రదం చేయాలని సంఘం నాయకుల విజ్ఞప్తి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గంలోని పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన బీసీ సర్పంచులకు రేపు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు బీసీ సంఘం నాయకులు తెలిపారు.
పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచులను పార్టీలకతీతంగా సత్కరించడం జరుగుతుందని చెప్పారు. ఆదివారం తాండూరు పట్టణం మంతటి పాండయ్య కళ్యాణ మండపంలో సర్పంచులకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.

బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు, నియోజకవర్గ కన్వీనర్ కందుకూరి రాజ్ కుమార్ అధ్యక్షతన నిర్వహిస్తున్న కార్యక్రమానికి రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ జీ. మధుసూదన్ రావు, ప్రముఖ రియల్ ఏస్టేట్ వ్యాపారి, సాయిపుత్ర హోమ్స్ అండ్ డెవలపర్స్ అధినేత భావనోళ్ల శంకర్ యాదవ్ తో పాటు విద్యా వేత్తలు, మేధావులు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు, కుల సంఘాల నాయకులు హాజరవుతున్నారని వివరించారు. కావున బీసీ సంఘం నాయకులు, బీసీ బందువులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో బీసీ సంఘం రాష్ట్ర నాయకులు సయ్యద్ షుకూర్, జిల్లా నాయకులు గడ్డం వెంకటేష్, బసవరాజ్, రాము ముదిరాజ్, వెంకటేష్, పాండు గౌడ్, పరమేష్, బాల్ రాజ్, చరణ్ తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

