రాజ్యాధికారమే బీసీల లక్ష్యం..!

తాండూరు రాజకీయం వికారాబాద్

రాజ్యాధికారమే బీసీల లక్ష్యం..!
– రాజకీయాల్లో ఐక్యమత్యంగా రాణించాలి
– బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్
– హక్కులు తెలుసుకుని గ్రామాల అభివృద్ధికి పాటుపడాలి
– రిటైర్డ్ ఆడిషనల్ ఎస్సీ మధుసూదన్ రావు
– పండగలా బీసీ సర్పంచులకు సన్మానం
తాండూరు, దర్శిని ప్రతినిధి : రాజ్యాధికారమే లక్ష్యంగా బీసీలు ఎదగాలని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ అన్నారు. సర్పంచులు హక్కులు తెలుసుకుని గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ మధుసూదన్ రావు అన్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన బీసీ సర్పంచులకు బీసీ సంఘం ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.

ఆదివారం తాండూరు పట్టణం ఎంపీటీ హాల్లో బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ అధ్యక్షత సర్పంచులకు సన్మాన కార్యక్రమం పండగలా జరిగింది. తాండూరు, బషీరాబాద్, పెద్దేముల్, యాలాల మండలాల్లోని సుమారు 67 మంది సర్పంచులను సన్మానించారు. బీసీ సంఘం నాయకులతో పాటు మేధావులు, ప్రముఖులు, సంఘాల నాయకులు, విద్యావేత్తలు గెలిచిన సర్పంచులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కందుకూరి రాజ్ కుమార్ మాట్లాడుతూ తాండూరు నియోజకవర్గంలో 20శాతం సర్పంచు రిజర్వేషన్లు అయితే 26 శాతం బీసీలు గెలుపొందడం జరిగిందన్నారు. ఇంతటి విజయాలు బీసీలకు గర్వకారణమన్నారు. సర్పంచుల గెలుపులు జిల్లాలో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చరిత్ర సృష్టించారని అన్నారు.
రాబోయే రోజుల్లో సర్పంచులే కాకుండా జెడ్పీటీసీలు, ఎంపీటీసీ, మున్సిపల్ కౌన్సిలర్లుగా కూడా గెలిచి బీసీల రాజ్యాధికారం సాధించాలని అన్నారు. ఐక్యమత్యంగా ఉండి ఉన్నత స్థాయికి రాజకీయంగా ఎదగాలని ఆకాంక్షించారు. అదేవిధంగా రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ మధుసూదన్ రావు మాట్లాడుతూ సర్పంచులు తమ హక్కుల గురించి తెలుసుకోవాలన్నారు. భారత రాజ్యాంగంలో ఉన్న హక్కులపై అవగాహన పెంచుకోవాలని, గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. పలువురు మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా బీసీలను ఏకతాటి పైకి తీసుకవచ్చి సర్పంచులను సన్మానించడం అభినందనీయమన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు డా. జయప్రసాద్, విద్యావేత్త పర్యాద రామకృష్ణ, పెద్దేముల్ మాజీ వైస్ ఎంపీపీ మధులత శ్రీనివాస్ చారి, బీపీ సంఘం రాష్ట్ర నాయకులు సయ్యద్ షుకూర్, గడ్డం వెంకటేష్, విజయేందర్, కెఎన్ రాజు, అనిత, మంజుల, న్యాయవాదులు గోపాల్, దిలీప్ సింగ్, బీసీ మండలాల అధ్యక్షులు నరేందర్, లక్ష్మణ్ చారి, శ్రావణ్ కుమార్, బసంత్ కుమార్, యువ నాయకులు బసవరాజు, రాము ముదిరాజ్, పరమేష్, దుబాయ్ వెంకట్, హరి ప్రసాద్, పాండుగౌడ్, మహిళ ప్రతినిధులు అనిత, మంజుల, నర్సమ్మ, జగదీశ్వరి, శివలీల, విజయలక్ష్మీ, రాజు యాదవ్, రజక కృష్ణ, కమలాకర్, ఆరుణ్ రాజ్, ఏలేటి శ్రీనివాస్, నవీన్, టైలర్ రమేష్, గోపాల్, డాక్టరేట్ నర్సింలు, దావులయ్య తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

పట్టణంలో పల్లె ఓటర్లను తొలగించాలి