మళ్లీ.. ఆరు గ్యారెంటీలు..!

జాతీయం టెక్నాలజీ తాండూరు తెలంగాణ రాజకీయం వికారాబాద్ హైదరాబాద్

మళ్లీ.. ఆరు గ్యారెంటీలు..!
– అర్హులు గుర్తింపుకు ఏఐ టెక్నాలజీ
– ఆన్‌లైన్‌లోనే దరఖాస్తులకు అవకాశం
– అందుబాటులోకి త్వరలో మోబైల్ యాప్‌
– కసరత్తు చేస్తోన్న తెలంగాణ సర్కారు
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేస్తూ ఆదరణను పొందింది.

ప్రభుత్వ పథకాలకు అర్హులైన వారిని గుర్తించి.. సంక్షేమం, అభివృద్ధికి కృషి చేస్తోంది. తాజాగా ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను మళ్లీ అమలు చేసేందకు దృష్టి సారించింది. ఈ సారి కొత్త సంస్కరణలు తీసుకవచ్చేందకు ప్రణాళికలు రూపొందింది. ఆరు గ్యారెంటీల పథకాలు పక్కదారి పట్టకుండా అర్హులైన వారికే అందేలా చర్యలు చేపడుతోంది. త్వరలో ప్రారంభించే ఆరు గ్యారెంటీల కోసం ఏఐ టెక్నాలజీని వినియోగించబోతున్నారు.

పథకాల అమలులో ఎలాంటి అక్రమాలు జరగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆరు గ్యారెంటీల పథకాల కోసం ఆన్‌లైన్‌ ద్వారా లబ్దిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరిచేందకు ఏర్పాట్లు చేస్తోంది. అంటే ఆరు గ్యారెంటీల లబ్దిదారులు కాగితాలతో దరఖాస్తులు సమర్పించకుండా ఆన్‌లైనేలో చేసుకునే విధానంను అమలు చేయబోతోంది.

ఆరు గ్యారెంటీల కోసం ప్రవేశ పెట్టే ఏఐ టెక్నాలజీ ద్వారా అర్హులను గుర్తించబోతోంది. లబ్దిదారుల ఆధార్ కార్డు వివరాలను అనుసంధానం చేసి డూప్లికేట్ దరఖాస్తులను ఏరివేసేందుకు వీలు ఉంటుందని భావిస్తోంది. త్వరలోనే ఈ విధానంపై చర్యలు తీసుకోబోతుంది. ఆరు గ్యారెంటీల దరఖాస్తుల కోసం ఆన్ లైన్ వ్యవస్థతో పాటు మోబైల్‌ యాప్‌లను కూడా ప్రవేశ పెట్టే యోచనను ప్రభుత్వం పరిశీలిస్తోంది.

ఇదికూడా చదవండి…

సీఎంఆర్ఎఫ్ పథకం పేదలకు భరోసా