శ్రీ రాముడి కృపతో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి

తాండూరు రాజకీయం వికారాబాద్

శ్రీ రాముడి కృపతో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి
– మళ్ళీ వచ్చేది మన బీఆర్ఎస్ ప్రభుత్వమే
– తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
– టెక్సాస్‌ కార్యసిద్ది హనుమాన్ దేవాలయంలో పూజలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : శ్రీరాముడి కృపతో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ప్రార్థించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం మరియు బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలను పురస్కరించుకుని, బీఆర్ఎస్ యూఎస్ఏ విభాగం ఆధ్వర్యంలో డల్లాస్ నగరంలో జరగనున్న సభలో పాల్గొనేందుకు అమెరికాలో పర్యటిస్తున్న పైలెట్ రోహిత్ రెడ్డి పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇందులో భాగంగా శనివారం టెక్సాస్ రాష్ట్రంలోని కార్యసిద్ధి హనుమాన్ దేవాలయాన్ని స్థానిక ఎన్నారైలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్, పైలెట్ రోహిత్ రెడ్డి గారి బావ నవీన్ రెడ్డితో కలిసి సందర్శించారు. పూజల అనంతరం స్థానికులు వారిని ఘనంగా సన్మానించారు. శ్రీరాముని కృపతో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, మళ్లీ వచ్చేది మన బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఈ సందర్భంగా పైలెట్ రోహిత్ రెడ్డి గారు అన్నారు.

ఇదికూడా చదవండి…

యువతకు స్ఫూర్తి క్రాంతి కుమార్..!