దశలవారిగా పట్టణాభివృద్ధి..!

తాండూరు రాజకీయం వికారాబాద్

దశలవారిగా పట్టణాభివృద్ధి..!
– తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి
– రూ. 28కోట్లతో అమృత్‌2.0 పైపులైన్ పనులు
– మున్సిపల్ చైర్ పర్సన్‌ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి
– ఎన్టీఆర్, ఇందిరమ్మ, రాజీవ్‌ కాలనీలకు పైపులైన్ పనులు ప్రారంభం
తాండూరు, దర్శిని ప్రతినిధి : దశల వారిగా తాండూరు పట్టణ అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి అన్నారు. తాండూరు పట్టణంలో అమృత్‌ 2.0 కింద చేపడుతున్న పైపులైన్‌ పనులను చైర్ పర్సన్ నీరజా బాల్‌రెడ్డి ప్రారంభించారు.

గురువారం హైదరాబాద్‌ రోడ్డు మార్గం గీతా మందిరం వద్ద ఎన్టీఆర్ కాలనీ, ఇందిరమ్మ, రాజీవ్‌ కాలనీలకు తాగునీటి సరఫరా కోసం చేపడుతున్న పైపులైన్ పనులను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో ప్రారంభించిన అమృత్‌ 2.0 పనులను వేగవంతం చేయడం జరిగిందన్నారు. ఈ పనులతో ఎన్టీఆర్, ఇందిరమ్మ, రాజీవ్ కాలనీలకు తాగునీటి సమస్య తీరుతుందని అన్నారు.

తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహాకారంతో పట్టణాన్ని దశల వారిగా అభివృద్ధి పరుస్తామని అన్నారు. పట్టణంలోని 36 వార్డుల్లో రూ. 18 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు దృష్టిసారించడం జరుగుతుందన్నారు. అన్ని వార్డుల్లో మౌళిక సదుపాయాలు, సీసీ రోడ్లు, మురుగు కాలువలు తదితర పనులు చేపట్టి అభివృద్ధి చేసేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, కౌన్సిలర్ అల్లాపూర్ శ్రీకాంత్, మున్సిపల్ డీఈ మణిపాల్, ఏఈ ఖాజా హుస్సేన్, నాయకులు గాజుల మాధవి, బాతుల వెంకటయ్య, మల్లేశం, చైతన్య, సిబ్బంది తదితరులు ఉన్నారు.

భవిష్యత్తు బీఆర్ఎస్‌దే..!