మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లు ముమ్మరం
– బ్యాలెట్ స్ట్రాంగ్ రూం, కౌంటింగ్ కేంద్రాల పరిశీలన
– అధికారుతో కలిసి పర్యవేక్షించిన కమీషనర్ మధుసూదన్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : వచ్చే మున్సిపల్ ఎన్నికలకు తాండూరు మున్సిపల్ యంత్రాంగం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ఎన్నికల నోటిపికేషన్ నాటికి అన్ని సిద్దం చేసి ఉంచుతోంది.

ఎన్నికల నిర్వహణలో భాగంగా శుక్రవారం తాండూరు పట్టణంలోని సెయింట్ మార్క్స్ హైస్కూల్ లో స్ట్రాంగ్, కౌంటింగ్ హాల్ ల ఏర్పాట్లను సమీక్షించారు. కమీషనర్ మధుసూదన్ రెడ్డి టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. స్ట్రాంగ్ రూం, కౌంటింగ్ కు గదులు అనుకూలంగా ఉన్నాయా లేదా అని ఆరా తీశారు. బ్యాలెట్ బాక్సుల భద్రతకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని పరిశీలించారు.

ఎన్నికల కౌంటింగ్ కోసం తీసుకోవాల్సిన ఏర్పాట్లు, జాగ్రత్తలపై అధికారులతో కలిసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ వచ్చే మున్సిపల్ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్ట్రాంగ్ రూం, కౌంటింగ్ హాల్ లను పరిశీలించడం జరిగిందన్నారు. ఈ నివేధికను ఉన్నతాధికారులకు అందజేస్తామని, అన్ని కూలిస్తే తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కమీషనర్ వెంట డీఈ మణిపాల్, మేనేజర్ నరేందర్ రెడ్డి, టీపీఓ మౌనిక, సిబ్బంది శాంతిప్రియ, నరేష్, వంశీ, భూపతి, వెంకటయ్య, సాయి తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

