సభలు, ర్యాలీలకు అనుమతులు తప్పనిసరి
– తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య
– ఎప్పుడు, ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..?
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో నిర్వహించే సభలు, ర్యాలీలకు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య తెలిపారు.

గురువారం ఓ ప్రకటనలో మాట్లాడుతూ తాండూరు మున్సిపల్ లో మోడల్ ఎన్నికల కోడ్ అమల్లో ఉందని, అందరు ఎన్నికల నిబంధనలు పాటించాలన్నారు. సభలు, ర్యాలీలు, బ్యాండ్ బాజాలు, లౌడ్ స్పీకర్లు పెట్టుకునే పార్టీలు, అభ్యర్థులు అనుమతులు తప్పనిసరిగా పొందాల్సి ఉంటుందని అన్నారు. 48 గంటల ముందు డీఎస్పీ కార్యాలయంలో, మున్సిపల్ కార్యాలయంలో దరాఖాస్తులు చేసుకోవాలని స్పష్టం చేశారు. నిబంధనలను అతిక్రమిస్తే చట్టరిత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.

ఇదికూడా చదవండి…

