సాయిపూర్ లో గులాబీ మోత..!
– పట్లోళ్ల దంపతుల గెలుపే ధ్యేయంగా ప్రచారం
– అండగా నిలుస్తున్న ప్రజలు, అభిమానులు
– ప్రచారంలో పాల్గొన్న పట్లోళ్ల నర్సింలు, దీప నర్సింలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం సాయిపూర్లో గులాబీ శ్రేణుల ప్రచారం మోత మోగుతోంది. 9వ వార్డులో దీపా నర్సింలు, 10వ వార్డులో పట్లోళ్ల నర్సింలు ఎన్నికల ప్రచారం అట్టహాసంగా నిర్వహిస్తున్నారు.

ఎన్నికల్లో పోటీ చేస్తున్న పట్లోళ్ల నర్సింలు, ఆయన సతీమణి దీపా నర్సింలు గెలుపు కోసం మాజీ కౌన్సిలర్ పట్లోళ్ల సావిత్రమ్మ, పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు దండులా కదిలోస్తున్నారు. ఆయా వార్డులలో పట్లోళ్ల నర్సింలు, దీప దంపతులు పర్యటిస్తూ ఓటర్లను అప్యాయంగా పలకరిస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాండూరు పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయమని ప్రజలకు వివరిస్తున్నారు. అభివృద్ధి చేసే బీఆర్ఎస్ పార్టీకే పట్టం కట్టాలని కోరుతున్నారు.

బీఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. వచ్చే మూడేళ్లలో మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీనే అని గుర్తుచేస్తున్నారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి బంపర్ మెజార్టీ అందించాలని కోరుతున్నారు. సాయిపూర్ ప్రాంతాన్ని మోడల్ గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని పేర్కొంటున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

