వైభవంగా వరుణ యాగం..!
– ది గ్రేన్ అండ్ షేడ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పూజలు
– పాల్గొన్న ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
– పూజలు చేసిన బీఆర్ఎస్ నాయకులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ది గ్రేన్ అండ్ సీడ్స్ మర్చంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వరుణ యాగం వైభవంగా జరిగింది.

సోమవారం నెహ్రు గంజ్ ఆవరణలో అసోసియేషన్ ఆధ్వర్యంలో శివలింగాలకు రుద్రాభిషేకం, జలాభిషేకం, పంచసూక్త హోమం సహిత వరుణ యాగం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల నర్సింలు, మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి, ఎస్ఐఆర్ కన్వీనర్ కరణం పురుషోత్తంరావు, మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ పట్లోళ్ల బాల్‌రెడ్డి తదితరులు హాజరై శివునికి పూజలు నిర్వహించారు.

అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు పంజుగుల విఠల్ రెడ్డి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ దీపా నర్సింలు, సాయిపూర్ నర్సింలు, శ్రీనివాస్ చారి, వెంకట్ రెడ్డి, తాండూరు మండల పార్టీ అధ్యక్షుడు వీరేందర్ రెడ్డి, సర్పంచ్ పాండురంగా రెడ్డి, కౌన్సిలర్లు నవీనా, సుప్రీతా, నాగలక్ష్మి, సురేష్ నాయక్, నాయకులు వరాల శ్రీనివాస్ రెడ్డి, సంతోష్ గౌడ్, కరుణాకర్ పటేల్, మహేశ్వర్ రెడ్డి, చందు ముదిరాజ్, చెన్నారెడ్డి, అనంతరెడ్డి, రమేష్ గౌడ్, భీమ్ రెడ్డి, తదితరులు కూడా యాగంలో పాల్గొని పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆకాంక్షించారు. రైతుల పంటలు సమృద్ధిగా పండాలని, వ్యాపారులు అభివృద్ధి చెందాలని ప్రార్థించారు. సకాలంలో వర్షాలు కురిసి వ్యవసాయం అభివృద్ధి చెందాలని, ప్రతి రైతు కుటుంబం ఆనందంగా ఉండాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు, వ్యాపారులు, రైతులు, ప్రజాప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


