కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టండి..!
– రాజీవ్, ఇందిరమ్మ కాలనీలను మోడల్‌గా మారుస్తాం
– తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టాలని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం తాండూరు పట్టణ శివారు వార్డు నెంబర్ 8లోని ఇందిరమ్మ, రాజీవ్ స్వగృహ కల్ప కాలనీలలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి తలారీ సాయప్పకు మద్దతుగా ప్రచారం చేశారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజీవ్, ఇందిరమ్మ కాలనీల అభివృద్ధికి తోడ్పాటు అందిస్తానని తెలిపారు. ఎన్నికల తరువాత వార్డులో అభివృద్ధి పనులు చేపడుతామని అన్నారు. రెండు కాలనీలను మోడల్ కాలనీగా మార్చేందుకు కృషి చేస్తామన్నారు. కాలనీలో వేధిస్తున్న మురుగు సమస్యకు, రోడ్ల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తామన్నారు. వార్డు కౌన్సిలర్‌గా తలారి సాయప్పను గెలిపిస్తే అందరికి అందుబాటులో ఉండి సేవలను అందిస్తారని తెలిపారు. 11న జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేసి హస్తానికి పట్టం కట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అబ్దుల్ రవూఫ్, ముజీబ్ ఖాన్, నేతలు, కార్యకర్తలు, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

