వీరశైవ సమాజాన్ని మరువను
– ఎమ్మెల్సీకి శుభాకాంక్షలు తెలిపిన సమాజం సభ్యులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు వీరశైవ సమాజంకు తోడ్పాటు అందించడం ఎప్పటికి మరువనని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్నం మహేందర్‌రెడ్డి రెండో సారి ఏకగ్రీవంగా ఎన్నిక కావడం పట్ల సోమవారం తాండూరు వీరశైవ సమాజం అధ్యక్షులు అధ్యక్షులు పటేల్ ఇందూర్ శ్రీశైలం ఆధ్వర్యంలో సమాజ గౌరవ అధ్యక్షులు తంబాకు చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు గూళి పరమేశ్వర్ స్వామి, సహ కార్యదర్శి పటేల్ విజయ్ కుమార్ తదితరులు ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డిని కలిశారు. శాలువాతో సత్కరించి స్వీట్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ తాండూరు వీరశైవ సమాజం అభివృద్ధికి సహకరిస్తామని హామి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సమాజం సభ్యులు తుప్పుదు బస్వరాజు, అగ్గనూర్ జగదీశ్వర్, బిబ్బెళ్లి గౌరి శంకర్, గణాపూర్ శంకర్ తదితరులు ఉన్నారు.
