ప్రగతి బాట పట్టించాలి
– అంకిత భావం, ప్రజాసేవే లక్ష్యం
– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
– పట్టణ ప్రగతిలో సందడి చేసిన ఎమ్మెల్యే
తాండూరు, దర్శిని ప్రతినిధి: ప్రభుత్వం చేపట్టిన పట్టణ ప్రగతితో తాండూరును ప్రగతి బాట పట్టించాలని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా గురువారం ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పలు కార్యక్రమాలలో పాల్గొని సందడి చేశారు.

పట్టణంలోని 12, 17, 25, 26 వార్డుల్లో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ప్రజా ప్రతినిధులు, అధికారుల్లో నూతనోత్సహం నింపారు. 12వ వార్డులో క్రీడా ప్రాంగణం ప్రారంభించారు. మిగతా వార్డుల్లో మొక్కలు నాటారు. స్వచ్ఛతలో భాగంగా పలు వార్డుల్లో మహిళలకు తడిచెత్త, పొడిచెత్త డబ్బాలను అందజేశారు.
ఈ సంధర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సమస్యల సత్వర పరిష్కరం కోసం ప్రజాప్రతినిధులు కృషి చేయాలన్నారు. ప్రజలకు ఎంత ఎక్కువగా పనిచేస్తే అంత గోప్పగా ఖ్యాతిని సాధిస్తారని, తద్వారా ప్రజల్లో మనస్సుల్లో స్థానం సాధిస్తారని అన్నారు. వార్డుల్లో సమస్యలను స్వయంగా తెలుసుకుని బాధ్యతగా పనిచేయాలని, ప్రజల సౌకర్యాల కల్పనకు పాటుపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ అశోక్ కుమార్, మున్సిపల్ వైస్ చైర్మన్ దీపా నర్సింలు, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అఫ్పూ(నయూం), సీనియర్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి, రాజుగౌడ్, కౌన్సిలర్లు మంకాల రాఘవేందర్, పూజ రజనీకాంత్, ప్రభాకర్ గౌడ్, ఆఫ్రీన్, టీఆర్ఎస్ కార్యదర్శి సంతోష్ గౌడ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



