తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఆర్డీఓ, మున్సిపల్ ఇంచార్జ్ కమీషనర్ అశోక్ కుమార్‌ను వ్యవసాయ మార్కెట్ కమిటి(ఏఎంసీ) చైర్మన్ విఠల్ నాయక్ సన్మానించారు. ఇటీవల ఆర్డీఓ అశోక్ కుమార్‌కు ఉత్తమ ఆర్డీఓ అవార్డు వచ్చింది.

దీనిని పురస్కరించుకుని మంగళవారం మార్కెట్ కమిటి చైర్మన్ విఠల్ నాయక్ వైస్ చైర్మన్ వెంకట్‌రెడ్డితో కలిసి ఆర్డీఓ అశోక్ కుమార్‌ను సన్మానించారు. ఈ సందర్భంగా విఠల్ నాయక్ మాట్లాడుతూ తాండూరు ప్రాంత అభివృద్ధికి ఆర్డీఓ అశోక్ కుమార్ అందించిన సేవలకు గాను ఉత్తమ అవార్డు రావడం అభినందనీయమని అన్నారు. ఆర్డీఓ అశోక్ కుమార్ ఆర్డీఓగా, మున్సిపల్ ఇంచార్జ్ కమీషనర్‌గా తాండూరుకు మరిన్ని ఉత్తమమైన సేవలను అందించాలని ఆకాంక్షించారు.

