పోలీసు కేసులో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి ఊరట

తాండూరు రాజకీయం వికారాబాద్

పోలీసు కేసులో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి ఊరట
– పాత కేసులో హైకోర్టుకు హాజ‌రైన ఎమ్మెల్యే
– కేసును కొట్టివేసిన‌ట్లు వెల్ల‌డి
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : ఓ పోలీసు కేసులో తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి ఊరట లభించింది. ఆయనపై నమోదైన పోలీసు కేసును మంగళవారం హైకోర్టు కొట్టివేసింది. ఈ విష‌యాన్ని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి వెల్ల‌డించారు. గత సాధారణ ఎన్నికల ముందు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిపై వివిధ కేసులు న‌మోద‌య్యాయి. అందులోని ఓ కేసు విష‌యంలో భాగంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి హైకోర్టుకు హాజరయ్యారు. కేసు పూర్వపరాలను పరిశీలించిన న్యాయస్థానం కేసును కొట్టివేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. కేసులో త‌న‌కు న్యాయం జ‌రిగింద‌ని అభిప్రాయం వ్య‌క్తం చేశారు. ఈ కేసులో భాగంగా ఎమ్మెల్యే వెంట వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళీకృష్ణగౌడ్, తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ విఠల్ నాయక్, ఎంపీటీసీ సభ్యులు విజయ్ కుమార్, న్యాయవాది గోపాల్ తదితరులు కోర్టుకు హాజరయ్యారు.