బ‌డుల‌లో ప‌క‌డ్బందీగా పారిశుద్ధ్యం..!

తాండూరు రంగారెడ్డి వికారాబాద్

బ‌డుల‌లో ప‌క‌డ్బందీగా పారిశుద్ధ్యం
– అంగ‌న్‌వాడి, కాలేజీల‌కు శానిటైజ్ త‌ప్ప‌నిస‌రి
– మున్సిప‌ల్ చైర్ ప‌ర్స‌న్ స్వ‌ప్న ప‌రిమ‌ళ్
తాండూరు, ద‌ర్శిని ప్ర‌త‌నిధి : బ‌డుల‌లో పారిశుద్ధ్య ప‌నులు ప‌క‌డ్బందీగా చేప‌ట్టేలా.. అంగ‌న్‌వాడీ, కాలేజీల‌లో శానిటైజ్ ప‌నులు త‌ప్ప‌నిస‌రిగా చేసేలా చూడాల‌ని తాండూరు మున్సిప‌ల్ చైర్ ప‌ర్స‌న్ స్వ‌ప్న ప‌రిమ‌ళ్ అన్నారు. శ‌నివారం తాండూరు మున్సిప‌ల్ కార్యాల‌యంలో ఆర్డీఓ, ఇంచార్జ్ క‌మీష‌న‌ర్ అశోక్ కుమార్ ఆధ్వ‌ర్యంలో చైర్ ప‌ర్స‌న్ స్వ‌ప్న ప‌రిమ‌ళ్ అధ్య‌క్ష‌త‌న అత్య‌వ‌స‌ర స‌మావేశం ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్బంగా చైర్ ప‌ర్స‌న్ మాట్లాడుతూ ప్ర‌భుత్వ ఆదేశాల మేర‌కు వ‌చ్చే నెల 1వ తేది నుంచి ప్రారంభ‌మ‌వుతున్న నేప‌థ్యంలో మున్సిప‌ల్ ప‌రిధిలోని అన్ని వార్డుల‌లో ఉన్న ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లు, అంగ‌న్‌వాడి కేంద్రాలు, కాలేజీలో పారిశుద్ధ్య ప‌నులు చేప‌ట్టేలా బాధ్య‌త తీసుకోవాల‌న్నారు. ప‌రిస‌రాల‌ను ప‌రిశుభ్రంగా ఉంచేలా ప‌క‌డ్బందీగా ప‌నులు చేప‌ట్టాల‌న్నారు. శానిటైజ్ చేయ‌డంతో పాటు తాగునీటి, మ‌రుగుదొడ్ల స‌మ‌స్య‌లు లేకుండా చూడాల‌ని అన్నారు.


మాజీ కౌన్సిల‌ర్‌కు నివాళులు

——————————-
మ‌రోవైపు సమావేశం ప్రారంభంలో.. ఇటీవ‌ల మృతి చెందిన మాజీ కౌన్సిల‌ర్ నీరటీ శ్యాంసుందర్‌కు.. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు. ఈ కార్య‌క్ర‌మంలో మున్సిప‌ల్ వైస్ చైర్ ప‌ర్స‌న్ ప‌ట్లోళ్ల దీపా న‌ర్సింలు, మాజీ వైస్ చైర్ ప‌ర్స‌న్ ప‌ట్లోళ్ల ర‌త్న‌మాల‌, మాజీ వైస్ చైర్మ‌న్లు సాజిద్ అలీ, అసిఫ్‌, ఫ్లోర్ లీడ‌ర్లు సోమ శేఖ‌ర్, వ‌రాల శ్రీ‌నివాస్‌రెడ్డి, సిందూజ గౌడ్, కౌన్సిల‌ర్లు అబ్దుల్ ర‌జాక్, స‌ల్మా ఫాతిమా జుబేర్ లాల‌, సంగీతఠాకూర్, సాహు శ్రీ‌ల‌త‌, బోయ‌ర‌వి, వెంక‌న్న‌గౌడ్, కోఆప్ష‌న్ స‌భ్యులు త‌దిత‌రులు పాల్గొన్నారు.