తాండూరులో విజృంభిస్తున్న అతిసార..!

ఆరోగ్యం తాండూరు వికారాబాద్

తాండూరులో విజృంభిస్తున్న అతిసార..!
– జిల్లా ఆసుపత్రిలో 50 కేసులు నమోదు
-అత్యధికంగా పాత తాండూరు నుంచే
– కలుషిత నీరే కారణమంటూ రోగుల ఆరోప‌ణ‌
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో అతిసార విజృంభిస్తోంది. తాండూరులోని జిల్లా ఆసుపత్రిలో దాదాపు 50 కేసులు నమోదు కావడంతో ప్రజల్లో కలకలం సృష్టిస్తోంది. ఇందులో తాండూరు మున్సిపల్ పరిధి పాత తాండూరు నుంచి అత్యధికంగా లు ఉండడం గమనార్హం.
తాండూరులో అతిసార కేసులు నమోదైన సంఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. తాండూరు పట్టణం, పాత తాండూరుతో పాటు తాండూరు మండలం, యాలాల, పెద్దేముల్ మండలాల నుంచి కేసులు నమోదవుతున్నాయి. పెద్దలు, వృద్ధులతో పాటు చిన్నారులు ఆసుపత్రి పాలై చికిత్స పొందుతున్నారు.
ఆసుపత్రిలోని పెద్దలు, మహిళలు, చిన్నారుల వార్డుల్లో అతిసారతో బాధపడుతున్న వారంతా 50 మందికిపైగా చికిత్స పొందుతున్నారు. ఒక్క పాత తాండూరు నుంచే దాదాపు 26 మంది బాధితులు అతిసారతో ఆసుత్రిలో చికిత్స పొందుతున్నారు.

అధికారులు పట్టించుకోలేదు
పాత తాండూరులో గత కొన్ని రోజులుగా కలుషితమైన నీరు సరఫరా అవుతుందని అధికారులకు చెప్పినా స్పందించలేదని రోగుల బందువులు ఆరొ పించారు. కలుషితమైన నీరు సేవించడం వల్లే రోగాల బారిన పడుతున్నామని, ఇప్పటికైనా తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.