విశ్వ వేధలో పండగల శోభ..!

తాండూరు రాజకీయం వికారాబాద్

విశ్వ వేధలో పండగల శోభ..!
– వైవిద్యంగా సైన్స్‌ డే సెలబ్రేషన్స్‌
– హాజరైన మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని విశ్వే వేధ హై స్కూల్లో భారతీయ పండగల శోభ సంతరించుకుంది. ఒకే రోజు వివిధ పండగలను జరుపుకున్నారు. శనివారం జాతీయ సైన్స్‌ దినోత్సవాన్ని వైవిధ్యంగా జరుపుకుని ప్రత్యేకతను చాటుకున్నారు.

ఈ కార్యక్రమానికి తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా పాఠశాలలో గ్రామ దేవత, బోనాల జాతర, దేవతా మూర్తులకు సంబంధించిన పండగలను సంతోషంగా జరుపుకున్నారు. విద్యార్థులు పలు దేవతలు, భక్తుల వేషాధారణలో పాల్గొని ఆకట్టుకున్నారు. విద్యార్థులు శాస్త్రీయ దృక్పథంతో పండుగల వెనుక ఉన్న ఆరోగ్య, పర్యావరణ ప్రయోజనాలను వివరించారు.

అనంతరం మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించారు. పాఠశాల ప్రిన్సిపాల్ జి. వెంకటేష్, కరస్పాండెంట్ జి. గణేష్ కుమార్, డైరెక్టర్ పి. సుజాతలను అభినందించారు. మరోవైపు వేడుకలకు హాజరైన విద్యార్థుల తల్లిదండ్రులు అన్ని పండగల ప్రదర్శనపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ అల్లాపురం శ్రీకాంత్, పాఠశాల టీచర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


.

శ్రీ నేతాజీలో సైన్స్‌ డే సంబరాలు..!