తాండూరు స‌బ్ డివిజ‌న్‌లో ఇద్ద‌రు ఎస్ఐల బ‌దిలీలు

తాండూరు వికారాబాద్

తాండూరు స‌బ్ డివిజ‌న్‌లో ఇద్ద‌రు ఎస్ఐల బ‌దిలీలు
– కర‌న్‌కోట్ ఎస్ఐగా మ‌ధుసూద‌న్‌రెడ్డి, య‌లాల ఎస్ఐగా శంక‌ర్
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : తాండూరు స‌బ్ డివిజ‌న్ పోలీసు శాఖ‌లో ఇద్ద‌రు ఎస్ఐలు బ‌దిలీ అయ్యారు. వారి స్థానంలో కొత్త ఎస్ఐలు బాధ్య‌త‌లు చేప‌ట్టారు. వివ‌రాల్లోకి వెళితే తాండూరు మండ‌లం క‌ర‌ణ్‌కోట్ ఎస్ఐ ఏడుకొండ‌లు, యాలాల ఎస్ఐ సురేష్‌ల‌ను బ‌దిలీ చేస్తున్న‌ట్లు ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. వారిద్ద‌రిని వికారాబాద్ జిల్లా ఎస్పీ కార్యాల‌యంలో రిపోర్టు చేయాల‌ని ఉత్త‌ర్వులో పేర్కొన్నారు. ఇదిలా ఉండ‌గా క‌రణ్ కోట్ ఎస్ఐ ఏడుకొండ‌లు స్థానంలో జోగులాంబ గ‌ద్వాల జిల్లా అలంపూర్ హెడ్ క్వార్ట‌ర్స్‌లో విధులు నిర్వ‌హిస్తున్న మ‌ధుసూధ‌న్ రెడ్డిని నియ‌మించారు. యాలాల ఎస్ఐ సురేష్ స్థానంలో పి.శంక‌ర్‌ను నియ‌మించారు. ఈ మేర‌కు క‌ర‌ణ్‌కోట్, యాలాల పోలీస్టేష‌న్ల‌లో బ‌దిలీపై వ‌చ్చిన కొత్త ఎస్ఐలు మ‌ధుసూద‌న్ రెడ్డి, పి.శంక‌ర్‌లు బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ మండ‌లంలోని అన్ని గ్రామాల్లో శాంతి భ‌ద్ర‌త‌ల ప‌రిర‌క్ష‌న‌కు కృషి చేస్తామ‌ని పేర్కొన్నారు. ప్ర‌జ‌లు ప్ర‌శాంత వాతావ‌ర‌ణానికి స‌హ‌క‌రించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.