వేం నరేందర్‌రెడ్డికి బుయ్యని శుభకాంక్షలు

తాండూరు రాజకీయం వికారాబాద్

వేం నరేందర్‌రెడ్డికి బుయ్యని శుభకాంక్షలు
– ఐటీ మినిస్టర్‌ శ్రీధర్‌బాబును కలిసిన శ్రీనివాస్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా ఎంపికైన వేం నరేందర్ రెడ్డిని తాండూరు కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

గురువారం వేం నరేందర్ రెడ్డిని బుయ్యని శ్రీనివాస్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. రాజ్యసభ అభ్యర్థిగా ఎన్నికైన సందర్భంగా శాలువాతో సన్మానించి శుభాంక్షలు తెలిపారు. అదే విధంగా హైదరాబాద్ లోని మినిస్టర్ క్వార్టర్స్ లో ఐటీ శాకమంత్రి శ్రీధర్ బాబును కూడా శ్రీనివాస్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. వ్యక్తి గత వ్యాపారంతోపాటు తాండూర్ రాజకీయాల గురించి చర్చించినట్టు సమాచారం. జిల్లా పరిషత్ చైర్మన్ కోసం కూడా మంతనాలు జరిపినట్టు సమాచారం.

తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్‌గా పట్లోళ్ల నర్సింలు..!