పైలెట్ ఇమేజ్ డ్యామేజ్‌కు కుట్ర..!

తాండూరు రాజకీయం వికారాబాద్

పైలెట్ ఇమేజ్ డ్యామేజ్‌కు కుట్ర..!
– రోహిత్‌ రెడ్డిపై డ్రగ్స్‌ కేసు పెద్ద బోగస్‌
– వ్యక్తిగత ఆరోపణలు చేయడం తగదు
– షోకాజ్ నోటీసుకు సమాధానం ఇస్తాం
– పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం
– మీడియా సమావేశంలో తాండూరు బీఆర్ఎస్ నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఇమేజ్‌ను డ్యామేజ్ చేసేందుకే కేసులలో ఇరికిస్తున్నారని స్థానిక బీఆర్ఎస్ పార్టీ నేతలు అన్నారు. బుధవారం తాండూరులో బీఆర్ఎస్ పార్టీ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ, నేతలు పట్లోళ్ల నర్సింలు, నరేందర్ గౌడ్, మండలాల అధ్యక్షులు, నేతలు మాట్లాడారు. తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిపై ఈనెల 15న జరిగిన డ్రగ్స్ కేసులో కుట్రలు దాగి ఉన్నాయని అన్నారు. సంఘటన 15వ తేదిన జరిగితే 14వ తేదిన ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంలో అనుమానాలు ఉన్నాయన్నారు. డ్రగ్స్, తుపాకుల కాల్పులపై సెక్షన్‌లను మార్చి కేసులో ఇరికించారని ఆరోపించారు. తాండూరు నియోజకవర్గంలో పైలట్ రోహిత్‌ రెడ్డిపై ఉన్న ఇమేజ్‌ను డ్యామేజ్ చేసేందుకే కేసుల్లో ఇరికిస్తున్నారని అన్నారు. ఇందుకు బీఆర్ఎస్ పార్టీని కూడా జోడిస్తూ పార్టీని బద్నామ్ చేసేందుకు పన్నాగాలు చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉందని, పోలీసులు వాళ్లే, కిట్లు వాళ్లవే అని కేసు నమోదుపై అనుమానాలను వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాతే గంజాయి కేసులు, అక్రమ కార్యకలాపాలపై కేసులు పెరిగాయని అన్నారు. రోహిత్‌ రెడ్డిని టార్గెట్‌ చేస్తూ కాంగ్రెస్ నేతలు వ్యక్తిగత విమర్శలకు పాల్పడుతున్నారని విమర్శించారు. రాజకీయంలో వ్యక్తిగత విమర్శలు తగదని, హుందాగా వ్యవహరించాలని సూచించారు.

ఆరు గ్యారెంటీల పథకాలను అమలును పక్కదారి పట్టించేందుకు డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. మున్సిపల్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ రోహిత్ రెడ్డిని బయట తిరగనివ్వము అనే మాటలు నిజం కావడం అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. మున్సిపల్‌లో మూడోసారి ప్రజా పాలన నిర్వహిస్తుండగా ఒక్కసారి అయినా నిధులు వచ్చాయా అని చెప్పాలని మున్సిపల్ చైర్ పర్సన్‌ను ప్రశ్నించారు. 9వ క్లాస్, 4వ క్లాస్‌ చదువుకున్న వాళ్లే ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు. 2028లో జరిగే ఎన్నికల్లో బీఆర్ఎస్‌ పార్టీ గెలుపు ఖాయమని అన్నారు.

కేసుల పరిణామాలలో రోహిత్ రెడ్డికి ఇచ్చిన షోకాజ్‌ నోటీసుకు బదులు ఇస్తామని, పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని అన్నారు. మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి అండగా ఉంటామని అన్నారు. రోహిత్ రెడ్డిపై డ్రగ్స్ కేసులో రిటేస్టుకు డిమాండ్ చేశాయడం జరిగిందని అన్నారు. రోహిత్ రెడ్డి కడిగిన ముత్యంలా బయటకు వస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు శోభారాణి, పరిమళ, వరాల శ్రీనివాస్ రెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ సలీం, కోట్‌పల్లి మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ ఉప్పరి మహేందర్, మండలాల అధ్యక్షులు నర్సిరెడ్డి, రవీందర్ రెడ్డి, కౌన్సిలర్లు అనిల్, సురేష్‌ నాయక్, జావిద్, నాయకులు సంతోష్‌ గౌడ్, రుద్రుపాటిల్, చంటి యాదవ్, వివిధ మండలాల సర్పంచులు, ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

తాండూరులో రైల్వే గూడ్స్‌ వై క్యాబిన్ ప్రారంభం