రోడ్ల పురోగతి చేపట్టాలి..!

తాండూరు రాజకీయం వికారాబాద్

రోడ్ల పురోగతి చేపట్టాలి..!
– బైపాస్, కోట్‌పల్లి రోడ్ల పూర్తికి చర్యలు తీసుకోవాలి
– జాతీయ రహదారిని వేగవంతం చేయాలి
– అసెంబ్లీ సమావేశంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గంలో రోడ్ల పురోగతి చేపట్టాలని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కోరారు.

బుధవారం అసెంబ్లీ సమావేశంలో మాట్లాడుతూ తాండూరులోని బైపాస్ రోడ్డు, తాండూరు – కోట్‌పల్లి రోడ్డు, జాతీయ రహదారి నిర్మాణంపై ప్రస్తావించారు. బైపాస్ రోడ్డు నిర్మాణంలో ఎలక్ట్రిక్ స్థంబాల తొలగింపులో రెండు శాఖల మద్య సమన్వయంలోపం ఏర్పడిందని సభ దృష్టికి తెచ్చారు.

తాండూరు – కోట్‌పల్లి రోడ్డు విషయంలో కూడా ఇదే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. అదేవిధంగా తాండూరు మీదుగా జరిగే జాతీయ రహదారి పనులకు ఆంటకాలు ఏర్పడ్డాయని తెలిపారు. కాంట్రాక్టర్ పనులు నిలిపివేయడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. కావున సంబంధిత శాఖల మంత్రుల ద్వారా రోడ్ల పురోగతి చేపట్టేలా చూడాలని అసెంబ్లీ సమావేశంలో మనోహర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

పైలెట్ ఇమేజ్ డ్యామేజ్‌కు కుట్ర..!