పంచాయతీలో ‘ఏకగ్రీవాల’ జాతర..!
– ఓటింగ్ లేకుండానే సర్పంచులు, వార్డు సభ్యులు..?
– ప్రతి మండలంలో ఒకటి నుంచి నాలుగు పంచాయతీలు
– తాండూరులో గెలుపు ఏకపక్షమైన పంచాయతీలు ఇవే
తాండూరు, దర్శిని ప్రతినిధి : పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాల జాతర కొనసాగుతోంది. తాండూరు నియోజకవర్గంలో ఓటింగ్ జరగకుండానే పంచాయతీ సర్పంచులు, వార్డు సభ్యులు ఎన్నిక కాబోతున్నారు. శనివారం చివరి రోజు జరిగిన నామినేషన్ల స్వీకరణలో తాండూరు నియోజకవర్గంలో ఏకవగ్రీం అవుతున్న పంచాయతీల వివరాలు ఇలా ఉన్నాయి.

చివరి రోజు జరిగిన నామనేషన్ల స్వీకరణలో పంచాయతీ సర్పంచులు అభ్యర్థులుగా ఒక్కోక్క దరఖాస్తు మాత్రమే దాఖలు కావడంతో ఆయా పంచాయతీలు ఏకగ్రీవం కానున్నాయి. నియోజకవర్గంలోని ప్రతి మండలంలో ఒకటి నుంచి నాలుగు పంచాయతీల వరకు ఏకగ్రీవం బాట పట్టాయి. ఇందులో పెద్దేముల్ మండలంలోని సిద్దన్న మడుగు తాండాలో విజయ్, వీరాసింగ్ లు రెండున్నర సంవత్సరాల చొప్పున ఒప్పందంతో పంచాయతీని ఏకగ్రీవం చేసుకున్నారు. అదేవిధంగా దుగ్గాపూర్ సర్పంచ్ గా బుడిగజంగం మంగమ్మను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇక యాలాల మండలంలో లక్ష్మీనారాయణపూర్ గ్రామానికి గుర్రాల నాగమణి ఒక్కరే సర్పంచుగా నామినేషన్ వేశారు.

దీంతో ఈ గ్రామం ఏకగ్రీవం కానుంది. సంగెంకుర్దులో సుధాలక్ష్మి, కిష్టాపూర్ లో స్వప్నలు ఒకే నామినేషన్ వేయడంతో ఆ గ్రామాలు కూడా ఏకగ్రీవం కానున్నాయి. తాండూరు మండలంలో చిట్టిగణాపూర్ గ్రామంలో పటేల్ విజయ్ కుమార్ ఒక్కరే సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.

బషీరాబాద్ మండలం మంతన్ గౌడ్ లో ‘ఎస్టీ రిజర్వేషన్ కలిసి రావడంతో ఎరుకలి భీమప్ప ఒక్కరే నామినేషన్ వేయడంతో ఆ గ్రామం కూడా ఏకగ్రీవం కానుంది. బషీరాబాద్ మండలంలో నామినేషన్ల పర్వం రాత్రి వరకు కొనసాగడంతో మరిన్ని తాండాలు ఏకగ్రీవం అయ్యే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తున్నాయి. ఆయా గ్రామాల్లో సర్పంచులతో పాటు వార్డు సభ్యులను కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో తాండూరు నియోజకవర్గంలో పెద్దేముల్ లో 4, యాలాలలో 3. తాండూరు మండలం 1. బషీరాబాద్ మండలం ఒకటి చొప్పున 9 గ్రామాలు ఏకగ్రీవ పంచాయతీలు కాబోతున్నాయి.

ఇదికూడా చదవండి…

