రూ. 15లక్షలకు మాంసం వ్యర్థాల వేలం
– రెండోసారి వేలంలో దక్కించుకున్న వ్యాపారి
– కమీషనర్ ఏమన్నారంటే..?
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్‌లో మాంసం వ్యర్థాల వేలంలో రూ. 15లక్షలకు పూర్తయ్యింది.
మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డి, కమీషనర్ మధుసూధన్ రెడ్డిల సమక్షంలో రెండవసారి చికెన్, మటన్, ఫిష్ వ్యర్థాల బహిరంగబలం నిర్వహించారు.

ఈ బహిరంగ వేలంలో తాండూరు ప్రాంతానికి చెందిన కైఫ్ రియాన్ అత్యధికంగారూ. 15 లక్షలకు పాట పడి వేలాన్ని దక్కించుకున్నారు. కైఫ్ రియాన్, ఏజాజ్ ల మధ్యన పోటాపోటీగా వేలంపాట కొనసాగింది. అనంతరం కమీషనర్ మాట్లాడుతూ వేలం దక్కించుకున్న వ్యాపారి 7 రోజుల్లోపు నిబంధన మేరకు డబ్బులు చెల్లించాలని స్పష్టం చేశారు. లేదంటే వేలంను రద్దు చేయబడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ నరేందర్ రెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


