కార్యకర్తలందరిని కాపాడుకుంటాం

తాండూరు రాజకీయం వికారాబాద్

కార్యకర్తలందరిని కాపాడుకుంటాం
– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
– బీఆర్ఎస్ లో మాజీ సర్పంచ్, కాంగ్రెస్ నేతల చేరిక
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కంటి రెప్పలా కాపాడుకునే బాధ్యత తమదే అని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. ఆదివారం తాండూరు మండలంలోని ఓగీపూర్ మాజీ సర్పంచ్ రత్నాకర్, కాంగ్రెస్ నాయకులు సునీల్ కుమార్, కుర్వ రమేష్, రవి, చింతామణి పట్నంకు చెందిన తాండూరు యూత్ కాంగ్రెస్ ఇంచార్జ్ లక్ష్మీకాంత్ రెడ్డి, యువ నాయకులు శ్రీకాంత్ రెడ్డిలు తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా ఎమ్మెలె ఖ్య రోహిత్ రెడ్డి వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు, అభివృద్ధిని చేపట్టి తెలంగాణను నెంవన్ రాష్ట్రంగా మార్చారని అన్నారు. కాంగ్రెస్ పార్టీని వీడీ బీఆర్ఎస్ పార్టీలో చేరిన నేతలు, కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని అన్నారు.

మరోవైపు పార్టీలో చేరిన మాజీ సర్పంచ్, నాయకులు మాట్లాడుతూ తాండూరు నియోజకవర్గ అభివృద్ధి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డితోనే సాధ్యమవుతుందని అన్నారు. ఎన్నికల్లో ఆయనను గెలిపించుకునేందుకు పార్టీలో చేరడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో తాండూరు మార్కెట్ కమిటి వైస్ చైర్మన్ పటేల్ ఉమాశంకర్, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షులు సాయిరెడ్డి, సీనీయర్ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి…

సార్లు వస్తున్నారు..!