ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపిన నేతలు
– పైలెట్ రోహిత్ రెడ్డిని కలిసిన ఏఎంసీ చైర్మన్ విఠల్ నాయక్
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి స్థానిక బీఆర్ఎస్ నేతలు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం హైదరాబాద్ లో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిని తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ విఠల్ నాయక్, సీనియర్ నాయకులు గద్దె శ్రీనివాస్ చారి, మాజీ కౌన్సిలర్ ఇర్ఫాన్, ఉర్దూ ఘర్ చైర్మన్ అబ్దుల్ రజాక్, జిలాని తదితరులు మర్యాద పూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యేకు పుష్పగుచ్చం అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అభివృద్ధిలో తోడుంటామని, వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిపించుకుని.. మంత్రి పదవి చేపట్టేలా అండగా నిలుస్తామని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి మద్దతు తెలిపారు.

