నేడు ముర్షద్ దర్గాలో గందం సమర్పణ
– హాజరుకానున్న ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణంలోని ప్రసిద్ద ముర్షద్ దర్గాలో ఉర్సు ఉత్సవాల సందర్భంగా నేడు మంగళవారం గందం సమర్పించడం జరుగుతుందని టీఆర్ఎస్ సీనీయర్ నాయకులు, మాజీ కౌన్సిలర్ జుబేర్ లాల తెలిపారు. హజ్రత్ సయ్యద్ అబ్దుల్ కరీం సాహెబ్ కుటుంభీకులు సయ్యద్ అబ్దుల్ సాబేర్ పాష ఆధ్వర్యంలో రాత్రి 7 గంటలకు గంధం వేడుక ప్రారంభమవుతుందని చెప్పారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి హాజరవుతున్నారని తెలిపారు. అదేవిధంగా బుధవారం ఉదయం పాతేహా ఖవానీ, అన్నదాన కార్యక్రమాలు ఉంటాయని వివరించారు. కావున ప్రజలు, భక్తులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉర్సు ఉత్సవాల్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.
