జూటాకోరు.. దద్దమ్మా..!

తాండూరు రాజకీయం వికారాబాద్

జూటాకోరు.. దద్దమ్మా..!
– ఫండ్స్‌ లేకుండా తెచ్చిన జీవోలు చెత్త కాగితాలే
– కాంగ్రెస్‌ను విమర్శించే స్థాయి రోహిత్ రెడ్డిది కాదు
– ఎమ్మెల్యేపై నోరుజారితే ఊరుకునేది లేదు
– మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : అభివృద్ధిపై జూటా కోరు మాటలు.. ప్రగతి చేయలేని దద్దమ్మా మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అని తాండూరు నియోజకవర్గ నాయకులు అన్నారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ధారాసింగ్. జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్, డీసీసీబీ జిల్లా రవీందర్ గౌడ్ తదితరులు మాట్లాడుతూ కేఆర్ఎంబీకి కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టులు అప్పగించడంపై, తాండూరు అభివృద్ధి నిధులను ఎమ్మెల్యే అడ్డుకుంటున్నారని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి చేసిన వాఖ్యలను ఖండించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన పైలెట్ రోహిత్ రెడ్డి ఇప్పుడు అదే పార్టీపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.

ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత కరోనా కాలం అని, తరువాత ఎన్నికల కోడ్ వచ్చిందని కూతలు కూస్తూ అభివృద్ధి చేయలేదన్నారు. అంతకంటే ముందు మంజూరైన అభివృద్ధి పనులను తన ఐదేండ్ల పాలనలో పూర్తి చేయలేదన్నారు. పట్టణంలోని అతిథి గృహం, బైపాస్ రోడ్డు. గౌతాపూర్ రోడ్డు, హైదరాబాద్ రోడ్డు, కోట్ పల్లి ప్రాజెక్టు, జుంటుపల్లి ప్రాజెక్టులకు మరమ్మత్తులు కూడా చేయించలేకపోయారన్నారు. మాజీ మంత్రి మహేందర్ రెడ్డి హాయాంలో సాధించిన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడంతో పాటు ఎన్నికల ముందు ఫండ్స్ లేని జీవో తీసుకవచ్చి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారని అన్నారు.

ఐదేండ్ల పాలనలో సీఆర్, ఎస్డీఎఫ్‌, డీఎంఎఫ్టీ నిధులు ఎక్కడ ఉన్నాయని ప్రశ్నించారు. ఐదేండ్ల పాలన నచ్చక ప్రజలు ఎన్నికల్లో ఓడించి గుణపాఠం చెప్పారని అన్నారు. బంజార భవన్, అంబేద్కర్ భవన్, బీసీ భవన్ పనులకు నిధులు అతిగతీ లేకుండా పోయాయన్నారు. ఫండ్స్ లేకుండా తెచ్చిన జీవోలతో అభివృద్ధి పనులు చేసిన కాంట్రాక్టర్లు, నేతలు బిల్లుల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని అన్నారు.

ఫేక్ అభివృద్ధి జీవోలపై ఇందిరా చౌరస్తాలో చర్చ నిర్వహించేందుకు సిద్ధమని పైలెట్ రోహిత్ రెడ్డి సవాల్క ప్రతి సవాల్ విసిరారు. అదేవిధంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని హామీలను నెరవేర్చేందుకు కృషి చేస్తుందన్నారు. ఒర్వలేక బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తుందన్నారు. బీఆర్ఎస్ బండారాలను బయటపెట్టి జైలుకు పంపడం భాయమన్నారు. మరోసారి కాంగ్రెస్ పార్టీపై, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిపై విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. కాంగ్రెస్ పార్టీపై, సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేసే స్థాయి పైలెట్ రోహిత్ రెడ్డికి లేదన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు జనార్ధన్ రెడ్డి, సర్దార్ ఖాన్, మాజీ ఎంపీపీ శరణు బసప్ప, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వడ్డె శ్రీనివాస్, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు నాగప్ప, నాయకులు కొమ్ము గోపాల్ రెడ్డి, కౌన్సిలర్లు బోయరవి. వెంకన్న గౌడ్, కోఆప్షన్ సభ్యులు అబ్దుల్ ఖవి, మల్లేశం, బాతుల వెంకటయ్య, వడ్డె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి…

సార్లు వస్తున్నారు..!