పకడ్బందీగా ఓటరు నమోదు
– యువతతో నమోదుకు దృష్టి
– మార్పుల, చేర్పులకు అవకాశం
– వలస ఓటర్లు, మరణించిన వారి ఓట్ల తొలగింపు
– ప్రజా ప్రతినిధులందరు సహకరించాలి
– వికారాబాద్ జిల్లా ఓటరు జాబితా పరిశీలకులు చంపాలాల్
వికారాబాద్, దర్శిని ప్రతినిధి: వికారాబాద్ జిల్లాలో ఓటర్ల నమోదును పకడ్బందీగా చేపట్టాలని జిల్లా ఓటరు జాబితా పరిశీలకులు, ఐఏఎస్ అధికారి చంపాలాల్ పేర్కొన్నారు. ఆదివారం వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో జిల్లా కలెక్టర్ నిఖిలతో పాటు రెవిన్యూ అధికారులు, వివిధ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఓటర్ జాబితాలో సవరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. 2022 జనవరి 1వ తేది నాటికి 18 సంవత్సరాలు నిండిన వారిని గుర్తించి ఫారం -6 ద్వారా కొత్త ఓటురుగా నమోదు చేయించాలని ప్రజా ప్రతినిధులను కోరారు. ముఖ్యంగా యస్సి, యస్టి లను, కళాశాల విద్యార్థులను గుర్తించి ఓటురుగా నమోదు చేయించాలని ప్రజా ప్రతినిధులను కోరారు. జాబితాలో చనిపోయిన వారిని, శాశ్యతంగా వలస వెళ్లిన వారిని గుర్తించి ఫారం -7 ద్వారా వారి పేర్లను జాబితాలో నుండి తొలిగించేందుకు ప్రజా ప్రతినిధులు కృషి చేయాలని సూచించారు. ఒకే వ్యక్తి వేరు వేరు రెండు పోలింగ్ స్టేషన్లలో ఓటర్ గా నమోదై ఉంటే ఫారం -8 ద్వారా సారి చేసుకోవాలని తెలియజేసినారు. 18 సంవత్సరాలు నిండిన వారందరూ కొత్తగా ఓటర నమోదు అయ్యేందుకు, ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులు చేసుకోవాలనుకునే ఓటర్లు ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని వికారాబాద్ జిల్లా ఓటర్ జాబితా పరిశీలకులు చంపాలాల్, ఐఏఎస్ తెలిపారు. ఈనెల ఒకటి నుండి 30 వరకు ఈ ప్రక్రియ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఓటురు జాబితాపై ఏమైనా అభ్యంతరాలు అక్షేపణలు ఉంటే స్థానిక ఆర్డీఓ, స్థానిక తహసీల్దార్లను సంప్రదించాలని సూచించారు. అవసరమైతే తనకు ఫోన్ నం. 8247329903 కు సంప్రదించాలన్నారు. తప్పులు లేని ఆరోగ్యావంతమైన ఓటురు జాబితా సిద్ధం చేయాలని అధికారులను సూచించారు.
ఓటర్ల నమోదుపై పరిలీలన
అనంతరం వికారాబాద్ పట్టణం లోని సంగం లక్ష్మిబాయి ఉన్నత పాఠశాలలో, శివారెడ్డిపేట, నెస్కల్ గ్రామంలో పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఓటర్ల జాబితాలను పరిశీలించారు. అనంతరము బిఎల్వోలు, అంగన్వాడీ టీచర్లు, పంచాయతీ సెక్రటరీతో మాట్లాడారు. కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ, ఓటర్ల జాబితాల సవరణ తదితర అంశాలపై వారిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నిఖిల, జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్,స్వీప్ నోడల్ అధికారి కోటాజి వికారాబాద్ / తాండూరు RDO లు ఉపేందర్ రెడ్డి, అశోక్ కుమార్, తహసీల్దార్లు, వివిధ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.