వేధిక్ విశిష్టలో ఉత్సహాంగా మాక్‌ పోలింగ్‌

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

వేధిక్ విశిష్టలో ఉత్సహాంగా మాక్‌ పోలింగ్‌
– ఓటు హక్కును వినియోగించుకున్న విద్యార్థులు
– ఓటింగ్, కౌంటింగ్‌, రిజల్ట్స్‌లతో సందడి
– విద్యార్థులకు ఎస్‌ఐఆర్‌పై అవగాహాన
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం చించొల్లి రోడ్డు మార్గంలో ఉన్న వేధిక్ విశిష్ట ది స్కూల్‌లో మాక్ ఎలక్షన్స్‌ ఉత్సహాంగా జరిగాయి. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపట్టిన ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఈ కార్యక్రమం నిర్వహించారు.

పాఠశాల ప్రిన్సిపల్ నాగభూషణం, వైస్ ప్రిన్సిపల్ శేరి మహిపాల్ రెడ్డిల ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు. పాఠశాలలో అసెంబ్లీ ఎన్నికల తరహాలో పోలింగ్ కేంద్రాలు, బ్యాలెట్ బాక్సులను, ఈవీఎం యంత్రాలను ఏర్పాటు ఎలక్షన్‌ వాతావరణం నెలకొల్పారు. అంతకుముందు ఎన్నికలలో పోటీ చేసే విద్యార్థులు నామినేషన్లు వేయడం, ఆ తరువాత గెలుపుకోసం ప్రచారం నిర్వహించడంతో పాఠశాలలో ఎన్నికల సందడి ఏర్పడింది. ఎన్నికలలో భాగంగా విద్యార్థులు బారులు తీరి ఒక్కొక్కరుగా ఓటు హక్కును వినియోగించున్నారు.

ఓటు వేసిన అనంతరం సిరా చుక్కును కూడా వేయించుకున్నారు. ఓటింగ్ అనంతరం ఉపాధ్యాయుల సమక్షంలో ఓట్ల లెక్కింపు చేసి విజేతలను ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ నాగభూషణం, వైస్ ప్రిన్సిపల్ శేరి మహిపాల్ రెడ్డిలు మాట్లాడుతూ పాఠశాల స్థాయి నుంచే ప్రతి విద్యార్థి ఓటు హక్కు ప్రాధాన్యతను తెలుసుకోవాలని అన్నారు. ప్రజాస్వామ్య విలువలను విద్యార్థులకు తెలుసుకోవాలనే ఉద్దేశంతో మాక్ ఎలక్షన్స్‌ నిర్వహించినట్లు తెలిపారు. అదేవిధంగా భారత ప్రభుత్వం చేపట్టిన ఎస్‌ఐఆర్‌పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్లు, ఉపాధ్యాయులు, ఎన్నికల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

సల్లంగా చూడు సవరమ్మ తల్లీ..!