కోటి వృక్షార్పణ మహాద్భుతం..!
– హరితహారంలో భాగస్వాములు కావాలి
– మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు
– తాండూరులో అట్టహాసంగా హరితహారం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రాన్ని పచ్చదనంగా మార్చేందుకు చేపట్టిన కోటివృక్షార్చన కార్యక్రమం మహాద్భతమని తాండూరు మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు అన్నారు. శనివారం సీఎం కేసీఆర్ పిలుపునిచ్చిన కోటివృక్షార్చన కార్యక్రమాన్ని తాండూరు పట్టణంలో అట్టహాసంగా ప్రారంభించారు. కొత్త మున్సిపల్ కార్యాలయం. సమీప ప్రాంతాల్లో చేపట్టిన కార్యక్రమానికి మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, కమీషనర్ షఫీవుల్లా, పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి, కౌన్సిలర్లతో కలిసి హాజరయ్యారు.

ఈ సందర్భంగా వారు మొక్కలు నాటి నీళ్లు పోశారు. అనంతరం వైస్ చైర్ పర్సన్ దీపా నర్సింలుతో పాటు పలువురు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా హరితహారం కార్యక్రమం చేపట్టడం హర్షణీయమన్నారు. రాష్ట్రా న్ని పచ్చదనంగా మార్చేందుకు సీఎం కేసీఆర్ ఒక్కరోజే కొ వృక్షార్చనకు పిలుపునివ్వడంతో అందరు భాగస్వాములు కావడం అభినందనీయమన్నారు. హరితహారంలో అందరు భాగస్వాములై మొక్కలు నాటాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ప్రభాకర్ గౌడ్, బోయరవి. భీంసింగ్, మున్సిపల్ డీఈ ఖాజా, మున్సిపల్ సిబ్బంది, ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి…

