బంగారం వ్యాపారుల ఘరానా మోసం..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

బంగారం వ్యాపారుల ఘరానా మోసం..!
– ఆబరణాల నాణ్యతలో గోల్‌మాల్‌
– 22 క్యారెట్ల గోల్డ్‌కు 24 క్యారెట్ల రేటు
– బాధితుడి ఫిర్యాదుతో వెలుగులోకి
– పోలీస్టేషన్‌కు పెరగనున్న బాధితుల సంఖ్య
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లా తాండూరులో బంగారు వ్యాపారుల ఘరానా మోసం బయటపడింది. ఆబరణాల నాణ్యతలో వ్యాపారులు చేసే గోల్‌మాల్ భాగోతం బహిర్గతం అయ్యింది.

తాండూరు పట్టణంకు చెందిన ఎండీ టిప్పు సుల్తాన్‌, విజారత్‌ హైమద్‌ అనే వ్యక్తులు పోలీసులకు చేసిన ఫిర్యాదుతో మోసాలు వెలుగులోకి వచ్చాయి. టిప్పు సుల్తాన్‌ మీడియాతో మాట్లాడుతూ తాండూరు పట్టణంలోని మహాలక్ష్మీ జువేల్లర్స్, పవన్‌ జువెల్లర్స్‌, జీపీ జువేల్లర్స్‌ దుకాణాలో కొన్ని నెలల క్రితం 24 క్యారెట్ల నాణ్యత(ఫ్యూరిటీ)తో ఆ నెలలో ఉన్న ధరకు బంగారు ఆబరణాలు కొనుగోలు చేసినట్లు వెల్లడించారు.

ఆయా దుకాణాల వ్యాపారులు కొనుగోలు చేసిన బంగారు ఆభరణాలకు 24 క్యారెట్ల ధరలకు విక్రయించినట్లు బిల్లులు కూడా ఇచ్చారని వివరించారు. అయితే కొన్ని రోజుల క్రితం కొనుగోలు చేసిన ఆబరణాలు అమ్మేందుకు వెళ్లగా అవి 22 క్యారెట్‌ కాదని చెప్పారని తెలిపారు. అనుమానం కలిగి హైదరాబాద్‌లో ఫ్యూరిటీ టెస్టులు చేపిస్తే అంతకన్న తక్కువ క్యారెట్‌ చూపించినట్లు తెలిసిందన్నారు. బంగారు వ్యాపారులు చేస్తున్న మోసంపై వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు.

ఈ సంఘటనతో తాండూరులో బంగారం వ్యాపారులు చేస్తున్న ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. మరోవైపు బంగారం వ్యాపారుల చేతిలో మోస పోయిన మరికొందరు బాధితులు పోలీసులను ఆశ్రయించే అవకాశం ఉంది. ఈ సంఘటనపై తాండూరు పట్టణ సీఐ వివరణ కోరగా ఫిర్యాదు మేరకు విచారణ జరుపుతున్నామని, తదుపరి ఖచ్చితమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

తెలంగాణ ఉద్యమకారులను గౌరవించాలి