శిఖం భూమిలో డ్వాక్రా భవనం నిలిపివేయాలి

తాండూరు రాజకీయం వికారాబాద్

శిఖం భూమిలో డ్వాక్రా భవనం నిలిపివేయాలి
– తాండూరు ఆర్డీఓకు గాజీపూర్ వాసుల ఫిర్యాదు
తాండూరు, దర్శిని ప్రతినిధి : శిఖం భూమిలో డ్వాక్రా భవనం నిర్మాణంను నిలిపివేయాలని పెద్దేముల్ మండలం గాజీపూర్ గ్రామస్తులు కోరారు.

సోమవారం తాండూరు ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ అనితకు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గాజీపూర్ గ్రామ శివారులో ఊర చెరువు శిఖం భూమి ఉంది. ఈ భూమిలో డ్వాక్రా భవనం పనులు చేపడుతున్నారు.

గతంలో ఇదే స్థలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సబ్‌ సెంటర్ నిర్మాణం చేపడితే అధికారులు కూల్చి వేసిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రస్తుతం అదే స్థలంలో డ్వాక్రా భవనం నిర్మాణ పనులు గ్రామ సర్పంచ్ భర్త అధికార పార్టీ అండదండలతో చేపడుతున్నారని ఆరోపించారు. వెంటనే భవన నిర్మాణ పనులు నిలిపివేయాలని ఆర్డీఓను కోరారు.

లేదంటే శిఖం భూమిలో భవనం నిర్మించడంపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ తిప్పణ్ణ చారి, మాజీ సర్పంచ్ వీరప్ప, నాయకులు సాయిలు గౌడ్, వీరేందర్‌ చారి, ముస్తఫా, చాంద్‌ పాష, వెంకట్‌ గౌడ్ తదితరులు ఉన్నారు.

కరువు మాపు.. ఈశ్వరా..!