ఎస్ఐఆర్తో అప్రమత్తంగా ఉండాలి
– అర్హులైన ప్రతి ఓటరును కాపాడుకోవాలి
– బీఆర్ఎస్ తాండూరు ఇంచార్జ్ పంజుగుల శ్రీశైల్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఎస్ఐఆర్ ప్రక్రియపై బీఆర్ఎస్ పార్టీ నాయకులు అప్రమత్తంగా ఉండాలని ఆ పార్టీ తాండూరు నియోజకవర్గ ఇంచార్జ్ పంజుగుల శ్రీశైల్ రెడ్డి అన్నారు.

బుధవారం తాండూర్ మండలంలోని మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీశైల్ రెడ్డి పంజుగుల మాట్లాడుతూ, ఎస్ఐఆర్ ప్రక్రియలో నియోజకవర్గ వ్యాప్తంగా బోగస్ ఓటర్లు అంటూ గుర్తిస్తున్న ఓటర్లపై పార్టీ నేతలు అప్రమత్తండా ఉండాలన్నారు.

ఫామ్-6, ఫామ్-8 దరఖాస్తుల పరిశీలనలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి అంశాలపై విస్తృతంగా చర్చించి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ప్రతి ఓటు ప్రజాస్వామ్యానికి విలువైనదని, ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా పార్టీ నాయకులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి, మున్సిపల్ మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, అన్ని మండలాల అధ్యక్షులు, జనరల్ సెక్రటరీలు, సీనియర్ నాయకులు, క్లస్టర్ ఇంచార్జులు, బీఎల్ఏలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎస్ఐఆర్ ప్రక్రియ పరిశీలన
బీఆర్ఎస్ పార్టీ తాండూర్ నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీశైల్ రెడ్డి పంజుగుల బుధవారం తాండూరు మండలం, తాండూరు పట్టణంలోలో విస్తృతంగా పర్యటించి ఎన్యూమరేషన్ ప్రక్రియను పరిశీలించారు.

పట్టణంలోని 1, 8, 28, 36 వార్డుల్లో ఇంటింటికి వెళ్లి జరుగుతున్న ప్రక్రియను స్వయంగా పరిశీలించడంతో పాటు బీఎల్ఓ, బీఎల్ఏలు, స్థానిక ప్రజలతో మాట్లాడి క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకున్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో బోగస్ ఓట్లకు ఏమాత్రం అవకాశం ఉండకూడదని, ఓటరు జాబితా పూర్తిగా పారదర్శకంగా, నిబంధనల ప్రకారమే రూపొందాలి అని కోరారు. ఈ నెల 24వ తేదీతో ప్రక్రియ ముగియనున్న నేపథ్యంలో, ఇప్పటి వరకు ఫారాలు అందని వారు వెంటనే బీఎల్ఓ, బీఎల్ఏలను సంప్రదించి ఫారాలు తీసుకుని నింపి తిరిగి అప్పగించాలని విజ్ఞప్తి చేశారు.

అలాగే ఏమైనా బోగస్ ఓట్ల వివరాలు తెలిస్తే పార్టీ ప్రతినిధులు లేదా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో తాండూరు టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ నరేందర్ గౌడ్, పట్లోళ్ల నర్సింహులు, ఫ్లోర్ లీడర్ దీపా నర్సింహులు, సీనియర్ మహిళా నాయకురాలు శోభారాణి, శ్రీనివాస్ చారి, సీనియర్ నాయకుడు వెంకట్ రెడ్డితో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


