చిలుక వాగుకు అదనంగా రూ. 30 కోట్లు..!
– ఆర్థిక శాఖ ఆమోదం కోసం ఎమ్మెల్యే కృషి
– డీప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసిన మనోహర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని చిలుక వాగు అభివృద్ధికి అదనంగా రూ. 30 కోట్లు సాధించేందుకు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రత్యేక కృషి చేస్తున్నారు.

ప్రాజెక్టు పూర్తి కోసం ఆర్థిక శాఖ నుంచి ఆమోదం పొంది నిధులు తీసుకవచ్చేందుకు చొరవ చూపిస్తున్నారు. బుధవారం డీప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా తాండూరు చిలుక వాగు ప్రాజెక్టు పూర్తి కోసం అదనంగా రూ. 30 కోట్లు మంజూరు చేయాలని గతంలో ఆర్థిక శాఖ ఆమోదం కోసం ప్రతిపాదనలు పంపినట్లు గుర్తుచేశారు. దీంతో పాటు నియోజకవర్గంలో ఇప్పటికే 6 విద్యుత్ సబ్ స్టేషన్లు మంజూరు కాగా టెండర్ల పక్రియ పూర్తికాలేదని వివరించారు.

ఈ విషయాలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకవెళ్లి చిలుక వాగుకు నిధులు, సబ్ స్టేషన్ట టెండర్లను పూర్తి చేయించి అభివృద్ధికి చొరవ చూపించాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు డీప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. అదేవిధంగా ధన్యవాదాలు తెలిపారు.


