రేపు తాండూరులో తాగునీటి సరఫరా బంద్

తాండూరు రాజకీయం వికారాబాద్

రేపు తాండూరులో తాగునీటి సరఫరా బంద్
– ప్రకటించిన మున్సిప్ల కమీషనర్ రాకేష్‌ రెడ్డి
– నీటి అంతరాయానికి కారణం ఇదే..?
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో రేపు ఆదివారం తాగునీటి సరఫరా జరగదని మున్సిపల్ కమీషనర్‌ రాకేష్‌ రెడ్డి తెలిపారు.

తాండూరు మీదుగా జరుగుతున్న జాతీయ రహదారి పనులలో భాగంగా శనివారం ఉదయం 6:00 గంటల నుండి సాయంత్రం 6:00 గంటల వరకు 12 గంటల పాటు కల్వకుర్తి పైప్‌లైన్ లో నీటి సరఫరాను నిలిపివేయడం జరుగుతుందని వెల్లడించారు.

ఈ కారణంగా రేపు ఆదివారం తాండూరు పట్టణానికి నీటి సరఫరా అంతరాయం కలుగుతుందని వివరించారు. కావున పట్టణ ప్రజలు నీటిని వృధా చేయరాదని, పొదుపుగా వాడుకోవాలని సూచించారు.

నీటి అవసరాల కోసం ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని అన్నారు. అదేవిధంగా వర్షాకాలంను దృష్టిలో ఉంచుని నీటిని కాచి.. చల్లార్చిన తరువాత సేవించాలని కోరారు.

తాండూరు ప్రభుత్వ ఆసుపత్రిని తరలించొద్దు..!