కేవీసీఎస్‌లో మాక్ ఎలక్షన్స్‌ జోష్‌

తాండూరు రాజకీయం వికారాబాద్

కేవీసీఎస్‌లో మాక్ ఎలక్షన్స్‌ జోష్‌
– ఉత్సహాంగా పాల్గొన్న విద్యార్థులు
– నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు దోహదం
– ప్రిన్సిపల్ ప్రశాంత్, డైరెక్టర్ సతీష్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం పోట్లీ మహరాజ్ దేవాలయంలోని క్రిష్ణవేణి కాన్సెఫ్ట్ స్కూల్‌లో మాక్ ఎలక్షన్ జోష్ కనిపించింది. 2026-27వ విద్యాసంవత్సరానికి గాను పాఠశాలలో హెడ్ బాయ్, హెడ్ గర్ల్ కోసం ఓటింగ్ నిర్వహించారు.

శనివారం స్కూల్ ప్రిన్సిపల్ ప్రశాంత్, డైరెక్టర్ సతీష్ పర్యవేక్షణలో నిర్వహించిన ఓటింగ్ లో స్కూల్ టీచర్లు, విద్యార్థులు ఉత్సహాంగా పాల్గొన్నారు. పాఠశాలలో హెడ్ బాయ్, హెడ్ గర్ల్ కోసం పదో తరగతి నుంచి అమ్మాయిలు, అబ్బాయిలు పోటీ పడ్డారు.

ఈ ఎన్నికల్లో పాఠశాలకు చెందిన 4వ తరగతి నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఓటింగ్ లో పాల్గొన్నారు. ఓటింగ్ కోసం నమూనా బ్యాలెట్ బాక్సులను ఏర్పాటు చేయగా అసెంబ్లీ ఎన్నికల తరహాలో విద్యార్థులు బారులు తీరి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ముందుగా ప్రిన్సిపల్ ప్రశాంత్, డైరెక్టర్ సతీష్ లు ఓటు వేశారు. అనంతరం విద్యార్థులతో పాటు టీచర్లు కూడా ఓటు వేశారు.

ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ప్రశాంత్ మాట్లాడుతూ విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు హెడ్ బాయ్, హెడ్ గర్ల్ ఎన్నికలు దోహదపడతాయని అన్నారు. ఈఎన్నికలు పాఠశాల విద్యార్థులను భవిష్యత్తు నాయకులుగా ఎదిగేలా తోడ్పడుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు, టీచర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

రేపు తాండూరులో తాగునీటి సరఫరా బంద్