స్థానిక పోరులో సత్తా చాటుదాం..!
– కలిసికట్టుగా పనిచేస్తే విజయం మనదే
– ఎంపీటీసీ, జెడ్పీటీసీలో యువతకు ప్రాధాన్యం
– ఆరు గ్యారెంటీల విఫల అస్త్రం ప్రయోగిద్దాం
– కాంగ్రెస్ బాకీ కార్డులను ఇంటింటి చేర్చాలి
– తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకుని సత్తా చాటుకుందామని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. మంగళవారం తాండూరు పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని తాండూరు, బషీరాబాద్, యాలాల, పెద్దేముల్, కోట్ పల్లి మండలాకు చెందిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా రోహిత్ రెడ్డి మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశా నిర్దేశం చేశారు. స్థానిక పోరులో అందరు కలిసి కట్టుగా పనిచేయాలన్నారు. పార్టీ మద్దతు దారుల గెలుపుకోసం సైనికుల్లా పనిచేసి బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటాలన్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో యువతకు ప్రాధాన్యం ఉంటుందని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం ముఖ్య మండల నాయకులతో మండల కమిటీలు, తాండూరు పట్టణ నాయకులకు ఇంచార్జీ బాధ్యతలు అప్పగించడం జరుగుతుందన్నారు.

మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామిలను అమలు చేయకుండా విస్మరించిందని అన్నారు. అదే అస్త్రంగా వాడుకుని ప్రజలను చైతన్య పరచాలన్నారు. ఇచ్చిన హామిలను విస్మరించి భాకీ పడిన పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. ఇందుకు బాకీ కార్డును ఇంటింటికి చేర్చాలన్నారు. కాంగ్రెస్ చేస్తున్న మోసాలను ప్రజలకు వివరించి.. ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనీయర్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి, మండల పార్టీల అధ్యక్షులు వీరేందర్ రెడ్డి. నర్సిరెడ్డి, వివిధ మండలాల మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి….

