సుశాంత్‌కు మనోహరన్న అండ
– చెట్టు మీదపడి గాయపడిన బాలుడికి ఆర్థిక
– సీఎంఆర్‌ఎఫ్ కింద రూ. 1.43లక్షల చెక్కు అందజేత
తాండూరు, దర్శిని ప్రతినిధి : చెట్టు మీదపడి గాయాలపాలైన బాలుడికి తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అండగా నిలించారు. సీఎంఆర్‌ఎఫ్ ద్వారా బాలుడికి రూ. 1లక్ష 43వేల 200 ఆర్థిక సాయం మంజూరైంది.

సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి బాలుడికి చెక్కును అందజేశారు. గత యేడాది సెప్టెంబర్‌లో తాండూరు మండలం జినుగుర్తి మోడల్ స్కూలుకు చెందిన సుశాంత్ బషీరాబాద్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో జరుగుతున్న జోనల్ స్థాయి క్రీడా పోటీలలో పాల్గొనేందుకు వెళ్లాడు.

అక్కడి మైదానంలో నిలబడి ఉండగా పెద్ద చెట్టు కొమ్మ విరిగి తలపై పడడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. మెరుగైన వైద్యం కోసం బాలుడిని హైదరాబాద్‌లోని ఆలీవ్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొంది ఇటీవలే కోలుకున్నాడు. తాజాగా ప్రభుత్వం సీఎంఆర్‌ఎఫ్ ద్వారా సుమంత్ కు రూ.1,43,200లను మంజూరు చేసింది.

గతంలో సుమంత్ ఆసుపత్రి ఖర్చుల కోసం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి వ్యక్తిగతంగా రూ.20 వేల ఆర్థిక సహాయం అందజేశారు. కుటుంబానికి అండగా నిలిచి, సహకారం అందించడం పట్ల కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డి, స్కూల్ ప్రిన్సిపల్ తదితరులు ఉన్నారు.


