గెస్ట్ లెక్చరర్ పోస్టులకు ఆహ్వానం
– తాండూరు డిగ్రీ కాలేజీలో దరఖాస్తుల స్వీకరణ
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం హైదరాబాద్ రోడ్డు మార్గంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో గెస్ట్ లెక్చరర్(అతిథి అధ్యాపకులు) పోస్టులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ వసంత కుమారి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.

కళాశాల విధ్యాశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు 2026–27 విద్యా సంవత్సరానికి అతిథి అధ్యాపకులు కోసం దరఖాస్తులను కోరుతున్నట్లు వెల్లడించారు. అర్హులైన, అనుభవజ్ఞులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించడం జరుగుతుందన్నారు.

ఇంగ్లీషు – 2, వాణిజ్యశాస్త్రం – 2 (ఇంగ్లీష్ మీడియం), 1 (ఉర్దూ మీడియం), రాజకీయశాస్త్రం – 1, గణిత శాస్త్రం– 1, కంప్యూటర్ సైన్స్ & అప్లికేషన్స్ – 2, హిందీ – 1, జంతుశాస్త్రం– 1, వృక్ష శాస్త్రం – 1, ఉర్దూ – 1 ఉన్నాయని తెలిపారు.
సంబంధిత సబ్జెక్టులో కనీసం 55% మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలని, (ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కనీస అర్హత 50% మార్కులు), పీహెచ్‌డీ, నీట్, సెట్ ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుందని స్పష్టం చేశారు.

బోధన అనుభవం ఉన్న అభ్యర్థులు తప్పనిసరిగాసర్వీస్ సర్టిఫికేట్సమర్పించాలని సూచించారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తులను ఈనెల 22వ తేది సాయంత్రం 4 గంటలలోపు కళాశాలకు స్వయంగా సమర్పించాలని సూచించారు.


