పైలెట్‌కు ఊరట..!

తాండూరు రాజకీయం వికారాబాద్

పైలెట్‌కు ఊరట..!
– త్వరలో తాండూరుకు రోహిత్ రెడ్డి
– కోర్టు పరిధి షరతులో సడలింపు
– బీఆర్ఎస్ పార్టీలో నెలకొన్న సందడి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి త్వరలోనే తాండూరుకు రాబోతున్నారని బీఆర్ఎస్ నేతలు తెలిపారు.

డ్రగ్స్‌ కేసు నేపథ్యంలో ట్రయల్ కోర్టు పరిధి దాటరాదని నిబంధన విధించడంతో రోహిత్ రెడ్డి హైదరాబాద్‌కే పరిమితం అయ్యారని గుర్తు చేశారు. అయితే హైకోర్టులో పిటిషన్ వేయడంతో బేయిల్ షరతులో ఉన్న ట్రయల్ కోర్టు ముందస్తు అనుమతి లేకుండా కోర్టు పరిధిని వీడరాదనే నిబందనలో సడలింపు వచ్చిందని వెల్లడించారు.

కోర్టులో కేసు దర్యాప్తు కీలక దశ పూర్తయ్యిందని పిటిషనర్‌ తరుపు వాదనకు ప్రాధాన్యం దక్కిందని తెలిపారు. మిగతా అన్ని షరతులు యథావిధిగా ఉంటాయని కోర్టు స్పష్టం చేసిందని తెలిపారు. దీంతో పైలెట్ రాకకు మార్గం సుగమం అయ్యిందన్నారు. ఎట్టకేలకు పైలెట్ రోహిత్ రెడ్డి ఎదురుచూపులకు తెరపడిందని అన్నారు.

బీఆర్ఎస్ శ్రేణులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న క్షణం త్వరలోనే రాబోతోందని అన్నారు. పైలెట్ రోహిత్ రెడ్డి తాండూరు నియోజకవర్గ ప్రజల మద్యకు రాబోతున్నారని తెలిపారు. మరోవైపు తాండూరుకు రోహిత్ రెడ్డి రాబోతున్నారని వార్త ప్రచారం రావడంతో బీఆర్ఎస్ పార్టీలో రాజకీయ సందడి మొదలైంది.

టీఆర్ఎస్‌ఎంఏ తాండూరు నూతన కార్యవర్గం ఎన్నిక