కుల వృత్తి దారులకు చేయూత
– రజక, నాయీ బ్రాహ్మణులకు మీటర్ల అందజేత
– ఉచిత విద్యుత్తును సద్వినియోగం చేసుకోవాలి
– ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి: రాష్ట్రంలోని కుల వృత్తి దారులకు తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక చేయూత అందిస్తుందని తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అన్నారు. బుధవారం తాండూరులో రజకులకు, నాయి బ్రాహ్మణులకు ప్రభుత్వం ఉచిత విద్యుత్ మీటర్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.


ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి రజక సంఘం, నాయి బ్రాహ్మణ సంఘం కు చెందిన లబ్ధిదారుల దుకాణాలలో బిగించిన ఉచిత విద్యుత్ మీటర్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ కుల వృత్తి దారులకు చేయూతను అందిస్తుందని.. ఉచిత విద్యుత్ ద్వారా రజకులకు, నాయీ బ్రాహ్మణులకు ఆర్థిక భరొసాను కల్పిస్తుందని పేర్కొన్నారు. లబ్ధిదారులు ఉచిత విద్యుత్తు సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమల్ గుప్తా, వైస్ చైర్ పర్సన్ దీపా నర్సింలు, మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్, టీఅర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అబ్దుల్ రౌఫ్, టిఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ శోబా రాణి, మాజీ కౌన్సిలర్ పరిమళ, జుబేర్ లాల, కౌన్సిలర్లు మంకల రఘు, బోయ రవి, వెంకన్న గౌడ్ టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.


