మూడు నెలలో.. రెండు పడకల ఇండ్లు
– పేదల దర్జాను పెంచేందుకు డబుల్ బెడ్‌రూంలు
– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి: అర్హులైన పేదలకు మూడు నెలల్లో రెండు పడకల ఇండ్లు మంజూరు చేసేందుకు కృతనిశ్చయంతో ఉన్నామని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. గత రెండు రోజుల క్రితం ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తాండూరు పట్టణ శివారు.. ఖాంజాపూర్ గేటు సమీపంలో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ రూం ఇండ్లను పరిశీలించారు.
పంచాయతీ రాజ్ అధికారులతో కలిసి నిర్మాణ దశలను అడిగితెలుసుకున్నారు. పనులు నాణ్యతంగా చేపట్టాలని ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తాండూరు పట్టణంలో డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. ప్రతి పేదవాడు రెండు పడకల ఇంటిలో సకల సౌకర్యాలతో దర్జాగా కాలుమీద కాలేసుకుని బతకాలన్న సీఎం కేసీఆర్ మహోన్నత ఆశయం మేరకే తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. త్వరలోనే అర్హులకు డబుల్ బెడ్‌రూం ఇండ్లు ఇచ్చేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు. ఈమేరకు మూడు నెలల్లో డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరయ్యేలా కృషి చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే వెంట తాండూరు మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, మార్కెట్ కమిటి వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అఫ్పూ(నయూం), సీనీయర్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, కౌన్సిరల్లు, యువనాయకులు తదితరులు ఉన్నారు.
