కాంగ్రెస్ నేతల సామాజిక సేవకు జేజేలు
– ఉచిత వైద్య శిబిరంలో 13 మందికి కంటి ఆపరేషన్లు
– అభినందించిన ఏఎంసీ చైర్మన్ బాల్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీ నాయకులు చాటుకుంటున్న సామాజిక సేవకు పలువురు జేజేలు పలుకుతున్నారు.

రెండు రోజుల క్రితం తాండూరు పట్టణం సాయిపూర్ 11 వ వార్డులో కాంగ్రెస్ నాయకులు లొంక నర్సింలు, యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు బంటు వేణుగోపాల్ సంయుక్త ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం, ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఉచిత కంటి వైద్య శిబిరంలో వివిధ ప్రాంతాలకు చెందిన 13 మందికి కంటి ఆపరేషన్లు అవసరమని గుర్తించారు. వారిని హైదరాబాద్ కు తరలించి.. ఉచితంగా ఆపరేషన్లు చేయించారు.

తిరిగి వారిని తాండూరుకు తీసుకవచ్చి సొంత ప్రాంతాలకు తరలించారు. కాంగ్రెస్ నాయకులు చేసిన సామాజిక సేవ కార్యక్రమంతో 13 మందికి కంటి చూపు ప్రసాదించి.. వెలుగులు నింపారు. ఈ సందర్భంగా తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి లొంక నర్సింలు, బంటు వేణుగోపాల్ లను అభినందించారు. అదేవిధంగా లొంక నర్సింలు, బంటు వేణుగోపాల్ మాట్లాడుతూ తమ వంతు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు.

ఇదికూడా చదవండి…

